Nalgonda : శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా కొనసాగుతున్న పూజలు

శనివారం 4వ రోజు మండప దేవత పూజలు,హోమాలు

Nalgonda : శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా కొనసాగుతున్న పూజలు

Nalgonda : నల్లగొండ. ఫిబ్రవరి 10 (క్విక్ టుడే) : న‌ల్ల‌గొండ పాతబ‌స్తీ శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం 4వ రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉదయం మండప దేవత పూజలు, హోమాలు నిర్వహించారు. 18 అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహానికి మహాస్నాపనము, 36 జలాలు, ధాన్యాలతోని స్వామివారికి అభిషేకము మహాస్నాపనము చేశారు,

సాయంకాలం సూర్య నమస్కారాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే గొప్ప పండితుడు వంటికాలు పైన సూర్య‌ నమస్కారం చేసేటటువంటి వారు  జక్కయ్యప‌ల్లి జగన్నాథ శాస్త్రి  వారి ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు చేశారు. హనుమంతుని గురువు సూర్యనారాయణ స్వామి కాబట్టి హనుమంతునికి ప్రీతిగా సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అనంతరం దాన్యాధివాసా కార్యక్రమం నిర్వహిస్తారు.

ఆదివారం ఉదయం 11 గంటల 25 నిమిషాలకు యంత్ర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారు. పట్టణ ప్రజలందరూ సోమవారం జరగబోయే కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని దేవులపల్లి నాగరాజు శర్మ కోరారు. శనివారం జరిగిన పూజా కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, దేవాలయ శాశ్వత అధ్యక్షులు, వేనేపల్లి లక్ష్మణరావు, అధ్యక్షులు బైరగోని రాజయ్య, ప్రధాన కార్యదర్శి బండారు ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?