Sri Rama Navami: 2024లో మీ జాతకం మారిపోవాలంటే శ్రీరామ నవమి రోజు ఈ మంత్రాలను పఠించండి...
అయితే అలాంటి రామ భక్తులకు ఏడాదికి ఒకసారి వచ్చే అత్యంత విశిష్టమైన పండుగ శ్రీరామనవమి. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రులలో వచ్చే శుద్ధ నవమి తిధి రోజు శ్రీరామనవమి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం ఏప్రిల్ 17 తేదీన శ్రీరామనవమి రావడం జరిగింది.
తద్వారా మీకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. మరి శ్రీరామనవమి సందర్భంగా వేదమంత్రాలను పఠించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో..?ఎలాంటి మంత్రాలు పటించాలి..? ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీరామ మంత్రం...
"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ రామ వరాననే"...శ్రీరాముని యొక్క ఈ శ్లోకాన్ని శ్రీరామనవమి రోజు నిత్యం పఠించడం వలన శ్రీమహావిష్ణువు సహస్రనామం పఠించినట్లేనని ,అంతటి ఫలితం వస్తుందని శివయ్య తన భార్య పార్వతి కి చెప్పినట్లుగా పురాణాలు చెబుతున్నాయి .
ఇక ఈ మంత్రంలో మనం ఉచ్చరించే రామ అనే పదాన్ని , విష్ణు ,మహేశ్వర రూపంగా పరిగణిస్తారు. ఈ పదంలో ఉన్న "రా" అక్షరం రుద్రుడిని "ఆ" అక్షరం బ్రహ్మను "మ" అక్షరం శ్రీహరిని సూచిస్తున్నట్లుగా వేదాలు చెబుతున్నాయి.
ఇక ఈ మంత్రంలో రామ అనే రెండు అక్షరాలను పదేపదే జపించడం వలన మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాక ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టవచ్చట. అయితే ఈ మంత్రాలను పఠించడానికిి ముందు మీరు భగవంతుని దగ్గర పూజ చేసి దీపం వెలిగించాలి.
అనంతరం మంత్రాలను పట్టించడం మొదలుపెట్టాలి. ఈ విధంగా చేయడం వలన మీకు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ శ్రీరామనవమిలో ఏకాగ్రతతో రామకోటి రాసి దానిని గుడిలో సమర్పించడం వలన అనుకున్నవి జరుగుతాయని నమ్మకం.