Shani Trayodashi on March 23 : ఈ శనివారం ప్రత్యేకత తెలిస్తే అస్సలు ఆగరు.. శనిత్రయోదశి నాడు ఈ పూజ చేయండి.. మీరు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది
అయితే.. అన్ని శనివారాలు గుడికి వెళ్లడం ఒక ఎత్తు అయితే.. మార్చి 23న రాబోయే శనివారం రోజు గుడికి వెళ్లడం మరో ఎత్తు. ఈ శనివారానికి ఉన్న ప్రత్యేకత మరే శనివారానికి లేదు. ఈ శనివారం.. త్రయోదశితో కలిసి రానుంది. అందుకే ఈ శనివారం.. శని త్రయోదశిగా రానుంది. మామూలుగా శనివారం విష్ణువుకు ఇష్టమైన రోజు. త్రయోదశి ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు.
Shani Trayodashi on March 23 : శని త్రయోదశి నాడు ఏ పూజలు చేయాలి? ఎలా చేయాలి?
శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలి. అంతకంటే ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో దీపం పెట్టుకోవాలి. గుడికి వెళ్లి శని పూజ సామాగ్రిని తీసుకెళ్లి నవ ధాన్యాలు, నల్ల నువ్వులు, నల్ల బట్ట, నువ్వుల నూనె తీసుకెళ్లి శనికి పూజ చేయాల్సి ఉంటుంది.
శని పూజ పూర్తవగానే మళ్లీ ఇంటికి వెళ్లి తలస్నానం చేసి మళ్లీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శనికి చెందిన సకల దోషాలు పోయి శని అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంకా మంచి ఫలితాలు కలగాలంటే శని త్రయోదశి నాడు.. శనికి తైలాభిషేకం చేసిన తర్వాత కాకిని నైవేద్యం పెట్టాలి. నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు, నువ్వుల నూనె పెట్టి దానం చేస్తే మంచిది.
కుదిరితే రాహువు, కేతువు పూజలు కూడా చేస్తే ఏలినాటి శని ఉన్నవాళ్లకు మంచి ఫలితాలు కలుగుతాయి. శని త్రయోదశి నాడు భక్తిశ్రద్ధలతో శనికి పూజలు చేసిన వాళ్లకు ఆ తర్వాత అంతా మంచే జరుగుతుందని, వాళ్ల జాతకం మారిపోతుందని.. శని అనుగ్రహంతో ఏలినాటి శని ఉన్నా, అష్టమ శని ఉన్నా కూడా వాళ్లకు శని అనుగ్రహం పొందడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుందన్నారు.
చాలామంది ఏవైనా పనులు ప్రారంభించినా వాటికి అడ్డంకులు వస్తుంటాయి. ఉద్యోగాల్లో కావచ్చు.. వ్యాపారాల్లో కావచ్చు.. ఇతర పనుల్లో కావచ్చు.. ఇలా అడ్డంకులు వచ్చే వాళ్లు శని త్రయోదశి నాడు ఖచ్చితంగా శని పూజలు చేసుకొని శని అనుగ్రహం పొందితే వాళ్లకు ఇక తిరుగే ఉండదు. శని అనుగ్రహం ఒక్కసారి వచ్చిందంటే మిమ్మల్ని ఇక ఎవ్వరూ ఆపలేరు. అందుకే ఈ విశిష్టమైన రోజు నాడు శనికి పూజలు చేసి ఆయన అనుగ్రహం పొందండి.