Nalgonda : ఛాయా సోమేశ్వర ఆలయంలో వైభవంగా శివపార్వతుల కల్యాణం, అగ్నిగుండాలు 

ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి

Nalgonda : ఛాయా సోమేశ్వర ఆలయంలో వైభవంగా శివపార్వతుల కల్యాణం, అగ్నిగుండాలు 

Nalgonda : నల్లగొండ జిల్లా ప్రతినిధి, మార్చి 9 (క్విక్ టుడే) : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని జిల్లా కేంద్రం పానగల్లులోని ఛాయా సోమేశ్వర ఆలయంలో శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంత రెడ్డి  ఆధ్వర్యంలో, వేద పండితుల మంత్రోచ్ఛార‌ణ‌ల మధ్య, సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ క‌ల్యాణ మ‌హోత్స‌వానికి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి దంపతులు స‌హా వేల సంఖ్య‌లో  భక్తులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డి.ఎస్.పి. శివరాంరెడ్డి, కౌన్సిలర్ బుర్రి రజిత యాదయ్య, ఆలయ మేనేజర్ యాదగిరి, భరత్ రెడ్డి, శ్రీనివాస్ శర్మ, కృష్ణమోహన్, హరిబాబు, సోమశేఖర్ గౌడ్, వెంకట్, శేఖర్ రెడ్డి, రుద్రసేన వాలంటీర్స్, ఆలయ అర్చకులు ఉదయ్ కుమార్, అజయ్ కుమార్ పాల్గొన్నారు.

96-2

అగ్నిగుండాలు
ఛాయా సోమేశ్వర ఆలయం ఆవరణలో శనివారం ఉదయం అగ్నిగుండాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి పల్లకిని మోస్తూ అనేకమంది భక్తులు మండే నిప్పులపై నడిచారు. స్వామివారిని నమ్ముకొని నిప్పుల పై నడిచిన కాలదని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, ఆలయ మేనేజర్ యాదగిరి, భరత్ రెడ్డి, శ్రీనివాస్ శర్మ, మధు, దశరథ, హరిబాబు, సోమశేఖర్ గౌడ్, వెంకట్, శేఖర్ రెడ్డి, రుద్రసేన వాలంటీర్స్, ఆలయ అర్చకులు ఉదయ్ కుమార్, అజయ్ కుమార్ పాల్గొన్నారు.

 

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?