Tirumala Arjitha Seva Tickets : ఈనెల 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. 23న అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల
రేపు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల లక్కీడిప్ ను నిర్వహించనున్నారు. ఈనెల 18 నుంచి 20 వ తారీఖు ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్ నమోదు ప్రక్రియ కొనసాగనుంది.

ఇక.. ఈనెల 23 వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టోకెన్లను విడుదల చేయనున్నారు. ఈనెల 24 వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ రిలీజ్ చేయనుంది.
మరోవైపు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం హనుమంత వాహనంపై రాముల వారిని పూజారులు ఊరేగించనున్నారు. తిరుమల వీధుల్లో రాముల వారిని ఊరేగించనున్నారు.
ఉదయం 9 నుంచి 11 వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ జరగాల్సిన సహస్ర దీపాలంకార సేవ రద్దు చేశారు. రేపు శ్రీరామ పట్టాభిషేకాన్ని టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు.

ఇక.. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్టలో కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు నుంచి ఈనెల 26 వరకు ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరగనున్నాయి.
ఇవాళ ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈనెల 22న రాత్రి సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది.
సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేశారు. లక్ష మంది భక్తులు వచ్చినా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్టలో ఈనెల 23న రథోత్సవం నిర్వహిస్తారు. ఒంటిమిట్టలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
