Eid Ul Fitr : నేడు కనిపించిన నెలవంక.. రేపు ఈద్-ఉల్-ఫితర్..
ఈ విషయం గురించి లక్నోకు చెందినటువంటి మెర్క్యూరీ చంద్ కమిటీ ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ రసీద్ ఫిరంగి మహలి ప్రకటన చేశారు. షియా చంద్ కమిటీ చైర్మన్ సైఫ్ అబ్బాస్ కూడా ఏప్రిల్ 11వ తేదీ నాడు అంటే గురువారం దేశవ్యాప్తంగా ఈద్ ను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ రోజు చంద్రుడు కనిపించటంతో ఏప్రిల్ 11న దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నారు.
భారతదేశంలో ఏప్రిల్ 11 అనగా గురువారం ఈద్ ను ఎంతో వైభవంగా జరుపుకునేందుకు ముస్లిం సోదరులు సన్నహాలు చేస్తారు. చంద్రుని దర్శనం భారతదేశంలో ఏప్రిల్ 10 న ఉంది. కనుక దీని ఆధారంగా ఈద్ పండగను మరుసటి రోజు అయినా ఏప్రిల్ 11న జరుపుకుంటారు. ఏప్రిల్ 11న ఉదయం 6:30 గంటలకు ఢిల్లీ జమా మసీదులో ఈద్ ప్రార్ధనలు మొదలవుతాయి.
కెనడా, బ్రిటన్, అమెరికా,సౌత్ అరేబియా ఇతర దేశాల్లో కూడా మార్చి 11,2024 నుండి రంజాన్ నెలలు ప్రారంభమయ్యాయి. ఇస్లామిక్ క్యాలెండర్ హిజ్రీ ప్రకారం ఒక నెల 29 లేక 30 రోజులు.ఈ దేశాలలో మాత్రం 29 రోజులు ఒక నెల.ఏప్రిల్ 9న ఈద్ చంద్రుడు కనిపించాడు. దీనివలన ఇతర దేశాలలో ఏప్రిల్ 10న అనగా బుధవారం రోజున జరుపుకుంటున్నారు.
భారతదేశంలో మాత్రం ఏప్రిల్ 11న ఈద్ ఉల్ ఫితర్ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 10 నుండి షవ్వాల్ మాసం ప్రారంభం. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఈద్ కోసం సన్నహాలు చేస్తున్నారు. ఈ పండగ తేదీ ప్రకటన కోసం ఎంతోమంది ప్రజల ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇస్లాం మతంలో ఈద్-ఉల్-ఫితర్ ఒక ప్రత్యేకమైన పండుగ. ఈ ఈద్ కు ముందు రంజాన్ ఏ పాక్ నెల ఉంటుంది..
ముస్లింలు అంతా కూడా ఈ నెలలో ఉపవాసాలు ఉండి అల్లాహ్ ఆరాధనలో సమయం గడిపేస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ లో రంజాన్ సంవత్సరం 9వ నెల.రంజాన్ పండగ పూర్తి అయిన తరువాత ఈద్-ఉల్-ఫితర్ రోజు నుండి షవ్వాల్ నెల ప్రారంభం కానుంది. ఈ ఈద్-ఉల్-ఫితర్ లో ఆసియా, అరబిక్ దేశాలలో ఈద్-అల్- పితార్ అని పిలుస్తారు.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింస్ అందరికీ కూడా చాలా ముఖ్యమైన రోజు. రంజాన్ ఏ పాక్ పూర్తి అయిన సందర్భంగా పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసాలు చేసిన వారికి ఈద్-అల్-ఫితర్ అల్లాహ్ నుంచి ప్రతిఫలం దక్కుతుందనేది వాళ్ల విశ్వాసం.రంజాన్ లో అల్లాహ్ ను ఆరాధించేందుకు ఆయన చేసినటువంటి మార్గాన్ని అనుసరించినందుకు కృతజ్ఞలు చెప్పేందుకు ఈద్ ను జరుపుకుంటూ ఉంటారు. ఈ ఈద్ లు కొన్ని దేశాలలో మూడు రోజులు పాటు కూడా జరుపుకునే సాంప్రదాయాలు కూడా ఉన్నాయి..