Tulasi Leafs Benefits : తులసి ఆకుల్ని దిండు కింద పెట్టుకుని పడుకుంటే.. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి
తులసి మొక్కతో ఇతర ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి సమయంలో మీరు పడుకునే దిండి కింద తులసి ఆకులను పెట్టి పడుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. భారతీయ సాంప్రదాయాలలో తులసి మొక్కను ఎంత పవిత్రంగా చూస్తారు. తులసి మొక్కతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.
విపరీతమైన కోపం ఉన్నవారికి దిండి కింద తులసి ఆకులు ఉంచితే కోపం అనేది కంట్రోల్ లో ఉంటుంది. మీ మీద ఉండే నరదృష్టి కూడా తగ్గిపోతుంది.. ఇలాంటి మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. అయితే ఈ మొక్కని తప్పుడు దిశలో నాటితే ఇంట్లో కుటుంబ కలహాలు గందరగోళాన్ని సృష్టిస్తుంది.
తులసి మొక్కను ఎప్పుడు కూడా దక్షిణ దిశలో ఉంచకూడదు.స్త్రీకి అవమానాలు ఎదురైనప్పుడు ఆ ఇంట్లో తులసిని నాటకూడదు. ఇంట్లో స్త్రీలకు అవమానాలు ఎదురైనప్పుడు జీవితం సంతోషంగా ఉండదు. తులసి మొక్కకు అక్కడ ఉంచకూడదు.
స్త్రీని అవమానించడం అంటే లక్ష్మీదేవిని అవమానించబడ్డట్టే.. అలాంటి ఇంట్లో తులసి మొక్కకి పెరగడం ఇష్టం ఉండదు. అలాగే స్నానం చేయకుండా లేదా బహిష్టు సమయంలో తులసి మొక్కకు ముట్టుకోవద్దు.. ఇలా చేయడం వల్ల మొక్క ఎండిపోతుంది. లక్ష్మీదేవికి ఆగ్రహం ముంచుకు వస్తుంది. ఆదివారం, ఏకాదశి నాడు తులసి మొక్కకి నీరు పోయవద్దు.
తులసి మొక్కను వంటగది బాత్రూం దగ్గర అసలే నాటవద్దు. తులసి మొక్క చుట్టూ ముళ్ళ మొక్కలు పెంచవద్దు.. ఎంతో పవిత్రమైన ఈ తులసి మొక్కను పవిత్రమైన ప్లేస్ లో పెంచితే ఆ తల్లి అనుగ్రహం తప్పక కలుగుతుంది..మాంసం, మద్యం సేవించే ఇంట్లో కూడా తులసి మొక్కను అసలు నాటవద్దు..
అలాంటి ఇంట్లో తులసి మొక్కను ఉంచడం వల్ల లక్ష్మీదేవి కి ఆగ్రహానికి గురవుతారు.. ఈ పవిత్రమైన తులసి పూజల కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంత బాగా ఉపయోగపడుతుంది..