Ugadi 2024 : ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో తొలి పూజలు చేసి మొక్కలు తీర్చుకున్న ముస్లిం భక్తులు
ఉగాది వచ్చింది అంటే ముస్లింలు ఆ గుడిలో తొలి పూజ నిర్వహిస్తారు. అదేంటి.. ముస్లింలు తొలి పూజ నిర్వహించడం ఏంటి అని అనుకుంటున్నారా? పదండి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.
దానికి కారణం ఏంటంటే.. వేంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు. ఆయన రెండో భార్య పేరు బీబీ నాంచారమ్మ. ఆమె ముస్లిం మహిళ. అందువల్ల ముస్లింలు అందరూ ఉగాది రోజు ఆ గుడికి వెళ్లి వేంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహిస్తారు.
ఈ ఆలయానికి ఉగాది రోజు ముస్లిం మహిళలు క్యూ కడతారు. పుట్టింటికి వెళ్లినప్పుడు ఎలా పుట్టింటి వారు.. తమ ఆడపడుచులకు చీర, సారే పెడతారో.. అదే విధంగా.. ప్రతి సంవత్సరం ముస్లిం మహిళలు వేంకటేశ్వర స్వామి భార్య బీబీ నాంచారమ్మను తమ పుట్టింటి ఆడపడుచుగా భావించి ఆమెకు చీర, సారే సమర్పిస్తారు.

అలాగే.. వేంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహిస్తారు. తమ ఆడపడుచును వేంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి.. తమ బావగా వేంకటేశ్వర స్వామిని భావించి ముస్లిం మహిళలు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఉగాది నాడు ఉదయమే ఆ గుడికి చేరుకొని ముస్లిం మహిళలు పూజలు నిర్వహిస్తారు. ఉగాది సంవత్సరం తొలి రోజు కాబట్టి ఆ రోజు పూజలు నిర్వహిస్తే.. తమ కోరికెలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. అందుకే ఉగాది నాడు ఉదయమే ఈ గుడికి చేరుకొని ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అంతే కాదు.. ఖచ్చితంగా ఉగాది నాడు వచ్చి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తే తమ కోరికెలు నెరవేరుతాయని ముస్లింలు బలంగా నమ్ముతారు. అందుకే.. ఏరోజు గుడికి వెళ్లినా వెళ్లకున్నా.. ఉగాది నాడు మాత్రం ఖచ్చితంగా గుడికి వెళ్లి తమ కోరికలను వేంకటేశ్వర స్వామికి విన్నవించుకుంటారు.
