Worshiping Dog : కుక్కకు పూజ చేస్తే కలిగే ఫలితం తెలిస్తే వెంటనే వీధికుక్కలను ఇంటికి తీసుకొచ్చి మరీ పూజలు చేస్తారు
దేవుడికి చెల్లించాల్సిన మొక్కులు ఎప్పటికప్పుడు చెల్లించుకుంటూ దేవుడా మమ్మల్ని మంచిగా చూడు. ఆరోగ్యంగా ఉండేలా చూడు. అష్టైశ్వార్యాలు ప్రసాదించు అని వేడుకుంటాం. దేవుడిని పూజించడం కొత్తేమీ కాదు. అది అందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తుంటారు. దేవుడిని పూజిస్తే మనకు మంచి జరుగుతుందని నమ్ముతాం.
Worshiping Dog : శునకానికి పూజ చేస్తే కుజ దోషం పోతుంది
నిజానికి కాలభైరవుడి ప్రతిరూపం అయిన కుక్కకు పూజలు చేస్తే కుజ దోషం పోతుందట. అంటే.. శునకానికి పూజలు చేయడం ఉత్తమం అని.. మంచి ఫలితాలు ఇస్తుందని పండితులు చెబుతున్నారు. అంతెందుకు.. గురువుగా పూజించే దత్తాత్రేయ స్వామి దగ్గర కూడా శునకం ఉంటుంది. అది దత్తాత్రేయుడి అనుగ్రహం పొందింది కాబట్టే దానికి పూజలు చేస్తుంటారు. నార్త్ ఇండియాలోనూ చాలాచోట్ల కుక్కలను రొట్టెలతో పూజిస్తుంటారు.
కుక్కలకు పూజలు చేస్తే అకాల మృత్యువు నుంచి తప్పించుకోవచ్చని అంటుంటారు పెద్దలు. దానికి కారణం.. మహాభారతం ప్రారంభ సమయంలో యముడు కుక్క రూపంలో వచ్చాడని చెబుతుంటారు. ఇలా.. కుక్కకు మన పురాణాల్లో విశిష్ట స్థానమే ఉంది. అందుకే చాలామంది కుక్కలకు పూజలు చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది శునకాలకు పూజలు చేస్తుంటారు.
చాలామంది తీర్థయాత్రలు చేసి వచ్చిన తర్వాత కుక్కలకు పూజలు చేస్తారు. ఏదైనా దూరప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్లిన వాళ్లు.. ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత కాల భైరవుడికి ధన్యవాదాలు తెలిపేందుకు ఇలా కాల భైరవుడి ప్రతిరూపం అయిన శునకానికి పూజలు చేసి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతారు. అందుకే కుక్కలకు ఒక పండుగ రోజు కూడా పెట్టారు పెద్దలు. కోర్ల పున్నమి నాడు కుక్కల కోసం కుడుములు తయారు చేసి వాటికి ఆహారంగా వేస్తారు.
దానికి కారణం.. మన ఇంట్లో ఉన్న బాధలన్నీ పోవాలని.. దోషాలన్నీ పోవాలని కుక్కలకు కుడుములు ప్రసాదంగా వేస్తారు. ఇలా.. ఒక్కో చోట ఒక్కో ఆచారం అమలులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆచారం.. నార్త్ ఇండియాలో మరో ఆచారం.. ఇలా పలు చోట్ల పలు రకాలుగా కుక్కలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా కుజ దోషం పోవాలన్నా, గురువు దత్తాత్రేయుడి అనుగ్రహం కావాలన్నా కుక్కలకు పూజలు చేయాలని పెద్దలు చెబుతుంటారు.