శంక పుష్పం పుష్పించే మొక్కలలో ఫార్మసీ కుటుంబానికి చెందిన మొక్క. దీనిని విష్ణుకాంత వృక్షానికి చెందినదిగా భావిస్తారు. హిందీలో ఈ మొక్కను అపరాధిత అంటారు. ఇవి ఆసియా ఖండానికి చెందినవి. ఈ చెట్లు చాలా గుబురుగా పెరుగుతూ ఉంటాయి. తమిళం, తెలుగు, మలయాళం భాషలలో దీని పేరు శంఖం నుంచి వచ్చింది. అయితే ఈ పుష్పం అనేది దేవుని పూజకు ఎంత విశిష్టంగా భావిస్తారు. అంతే ఇదిగా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ పువ్వులు నీలిరంగు, తెలుపు రంగులలో ఉంటాయి. అయితే శంఖపుష్పం మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శ్రీమహావిష్ణువుకు లక్ష్మీదేవికి శనీశ్వరుడికి కూడా ఈ పువ్వులు చాలా ఇష్టమైనవి. ఎవరైతే ఈ శంకు పూల చెట్టు ఇంట్లో పెంచుకుంటారో ఆ యొక్క ఇంటి మీద శ్రీమహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి వీరిద్దరి అనుగ్రహంతో పాటు సాక్షాత్తు ఆ శనీశ్వరుడి అనుగ్రహం కూడా ఉంటుంది. అలాగే శంకు పూల చెట్టు శనీశ్వరుడుతో ఉంటుంది అని కూడా చెప్తారు. కాబట్టి ఆ శనీశ్వరుడి అనుగ్రహం కూడా మీపై మీ కుటుంబం పై తప్పకుండా ఉంటుంది. ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది. ఎవరి ఇంట్లో అయితే ఈ చెట్టు ఉంటుందో వారికి డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. ఆర్థిక ప్రవాహం కూడా ఆ ఇంట్లో ఎంతో విశేషంగా ఉంటుంది.
ముఖ్యంగా సోమవారం రోజున ఐదు శంకు పువ్వులను తీసుకొని వాటిని నదిలో లేదా పారేటటువంటి నీటిలో కలిపితే మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు హనుమంతునికి శంకు పూలతో పూజ చేయండి. ఈ విధంగా చేసినా కూడా మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారంలో కలిసి వస్తుంది. శంకు పూలు అనేవి శివుడికి కూడా ఎంతో ప్రీతికరం. డబ్బు సమస్యలు అధిగమించడానికి సోమవారం రోజున శివలింగానికి ఈ పువ్వులను సమర్పించండి. ఆ బోలా శంకరుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే శనివారం రోజున శని దేవుడికి పుష్పాలను సమర్పించండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో శని స్థానం బలపడుతుంది. శని దేవుడు నుంచి మీకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగంలో ఏదైనా సమస్యలు ఉంటే గనుక ఈ శంకు పువ్వులతో పూజ చేయండి. ఆ శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం నీపై ఉంటుంది. ఇక ఉద్యోగంలో మీకు సమస్యలు ఉన్న ప్రమోషన్ విషయంలో బాధపడుతున్న ఈ సమస్యలకి ఒక్కటే పరిహారం. శంకు పువ్వులతో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం ఇక ఈ శంకు పువ్వులతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో సహాయపడేలా చేస్తుంది. వీటివల్ల ఎంతో మేలు కలుగుతుంది. అందుకే ఇంటికి ఖచ్చితంగా ఒక చెట్టు శంకు పుష్పాలు ఉండాలని చెబుతూ ఉంటారు. శంకు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే చాలామంది పరిగణించేవారు. అయితే ఈ మధ్యకాలంలో వీరి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తున్నాయి.
ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించే వారట. మళ్లీ ఇప్పుడు అనేక పరిశోధనల తర్వాత మళ్లీ ఆరోగ్యానికి శంకు పుష్పం అనేది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ శంకు పుష్పం ఎక్కువగా ఫుడ్ కలర్ గాను తీగాను ఎక్కువగా ఉపయోగించడానికి బాగా తెలుస్తుంది. పువ్వులతోపాటు వేరు, కాండం, ఆకులు అన్నీ ఆయుర్వేద వైద్యంలో వాడుతారు. శంకు పువ్వులు, ఆకులు, వేళ్ళతో చేసిన పొడిని జ్ఞాపకశక్తిని పెంచడంతోపాటు వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి అల్జీమర్స్ నుంచి కూడా రక్షిస్తుందట. ఈ పువ్వుల్లో ఉండే కొన్ని పదార్థాల తీరువల్ల మెదడు పనితీరు పనిచేసి మతి పరుపులు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక ఇప్పుడు ఉన్న కాలంలో నిద్రలేమి ఆందోళన ,ఒత్తిడి ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఈ నిద్రలేమి కారణాలకు శంకుపూల టి అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆమ్లాన్ని తొలగించే ఆంటీ ఆక్సిడెంట్ గా కూడా ఇది పనిచేస్తుంది. శంకు పూలను నీటిలో మరిగించి ఆ కషాయాన్ని వడగట్టి తాగవచ్చు.. ఇక నీలం రంగులో ఉండే శంకు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వచేసి ఫుడ్ కలర్ గా కూడా అనేక రకాల స్వీట్లు కేకులు ఐస్ చెట్టు బాగా పాపులర్ అయింది. కాబట్టి మీరు కూడా ఏ శంకు పుష్పం గనుక కనిపించిన ఈ చెట్టు కనిపించిన కచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. ఇది ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యపరంగా నీకు మేలు చేస్తుంది...