Peerzadiguda : సెట్విన్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు పరీక్షలు
పీర్జాదిగూడలో పరీక్షలను పరిశీలించిన సెట్విన్ ఇన్‌చార్జి వనజ
On
Peerzadiguda : పీర్జాదిగూడ, క్విక్ టుడే : తెలంగాణ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సెట్విన్ సెంటర్ లో వివిధ వృత్తి, విద్యా, నైపుణ్య కోర్సులలో శిక్షణ పొందిన విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం సెట్విన్ ఇంచార్జ్ వనజ పరిశీలించారు. సెట్విన్ శిక్షణ కేంద్రంలో కంప్యూటర్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఏసీ, ఫ్రిడ్జ్, మొబైల్ రిపేరింగ్, మగ్గం వర్క్స్, జ్యూట్, పేపర్ బ్యాగ్ మొదలైన కోర్సులలో శిక్షణ పొందిన నగరంలోని వివిధ కేంద్రాలలో శిక్షణ పొందిన సుమారు 250 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని ఇక్కడ సెంటర్ లో పరీక్షలు రాస్తున్నారని వనజ తెలిపారు.
3 రోజుల పాటు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు విద్యార్థులకు అవసమైన మౌలిక వసతులు కల్పించామని, పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు సర్టిఫికెట్ అందజేయనున్నట్లు తెలిపారు. వచ్చే వారం నుండి కొత్త బ్యాచ్ లకు శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు ఆసక్తి కలిగిన వారు వృత్తివిద్యా, నైపుణ్య కోర్సులలో శిక్షణ పొంది తాము ఎంచుకున్న రంగాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...