ఘ‌నంగా పల్లవి మోడల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే

ఘ‌నంగా పల్లవి మోడల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే

బోడుప్ప‌ల్‌, క్విక్ టుడే : బోడుప్పల్ లోని పల్లవిమోడల్ స్కూల్ లో శనివారం పాఠశాలలో ఉదయం  ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ దినోత్సవం “సంస్కృతి” అనే పేరుతో అతిపెద్ద వేదిక పైన ఘనంగా నిర్వ‌హించారు. .దీనికి ముఖ్య అతిథులుగా ప్రముఖ మనస్తత్వవేత్త,కెరీర్ కౌన్సెలర్, నడవడికలో మార్పుల మెళుకువల అధ్యాపకుడు సుధీర్ సంద్ర, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి తనూజ విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంను ముందుగా దీప ప్రజ్వలనంతో ప్రారంభించి, తదనంతరం అతిథులను సత్కరిస్తూ స్వాగతం పలికారు. తరువాత విద్యార్థులు విభాగాల వారిగా వివిధ రకాలైన చక్కని నృత్యాలను ప్రదర్శించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రంలో ప్రీ ప్రైమరీ విద్యా విభాగంను ముగించుకొని ప్రాథమిక విద్యలోకి అడుగిడుతున్న చిన్నారులను ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలను ఇస్తూ సన్మానించారు. ప్రత్యేక ప్రతిభను కనబరిచిన ఉపాధ్యాయులను కూడా వేదిక పైన ఘనంగా సన్మానించారు.

269

ఈ సందర్భంగా ముఖ్య అతిథి సుధీర్ సంద్ర మాట్లాడుతూ విద్యార్థుల మనస్థత్వాలను బట్టి తల్లిదండ్రులు నడుచుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. నూతన పద్ధతుల ద్వారా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఎలా కృషి చేయాలో తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ శ్రీమతి తనూజ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు వారిలో దాగిఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తామని తెలియజేశారు. పాఠశాలలో ఆటపాటలు కూడా ఎంతో అవసరమని వాటివల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా బలపడుతారని వివరించారు. చిన్నారుల ప్రతిభను గుర్తించి వారి సృజనాత్మకతకు గుర్తుగా విజేతలకు బహుమతులను  అందించారు. 

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?