ఘనంగా వసంత పంచమి అక్షరాభ్యాస వేడుకలు

చదువుతోపాటు సంస్కారాలు నేర్పించే ఏకైక విద్యాసంస్థ శ్రీ సరస్వతి శిశు మందిర్ : ఎంఈఓ అరుంధతి

ఘనంగా వసంత పంచమి అక్షరాభ్యాస వేడుకలు

 
నల్లగొండ ఫిబ్రవరి 14 (క్విక్ టుడే) : నల్లగొండ పట్టణం రవీంద్ర నగర్ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతంలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ లో సరస్వతి పూజ మరియు అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంఈఓ అరుంధతి, ఉమ్మడి జిల్లా ఆర్ఎస్ఎస్ ప్రచార సత్యం జి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఓ పిల్లవాడు ఏ విధంగా పెరగాలి, ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతి చిన్న పిల్లవాడు సెల్ ఫోన్ కి అలవాటు పడుతున్నాడు, ఆ విధంగా కాకుండా సరస్వతి శిశు మందిర్ లో అన్ని స్కూళ్లతో పాటు ఇంగ్లీష్ మీడియం విద్య  ప్రత్యేకంగా శిశు మందిర్ లో నైతిక విలువతో కూడిన సదాచారం అనే ఒక సబ్జెక్టు, విద్యాబుద్ధులతోపాటు చిన్ననాటి నుండే విద్యార్థులకు విలువలు, ఆధ్యాత్మికత, యోగ, ఓపిక, ఓ పిల్లవాడు ఏ విధంగా పెరగాలి మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ లో విద్యార్థులను చేర్పించి వాళ్ల ఉన్నతకి తోడ్పడాలని తల్లిదండ్రులను మండల విద్యాశాఖ అధికారి  అరుంధతి  కోరారు.
 
ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సత్యం జి మాట్లాడుతూ నల్గొండ నగరంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ లో వసంత పంచమి  అక్షరాభ్యాస  కార్యక్రమం నిర్వహించడం జరిగిందని,  బుధవారం శిశువులకి అక్షరాభ్యాసం చేయించడం వల్ల చిన్నారులలో షోడశ సంస్కారాలు వస్తాయని చెప్పి మన యొక్క విశ్వాసం కాబట్టి అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి శిష్యులు వాళ్ల యొక్క జ్ఞానాన్ని,వ్యక్తిత్వ వికాసం దిశగా కుటుంబాన్ని చక్కటి పద్ధతిలో తీసుకువెళ్లి దిశగా, అదేవిధంగా ఈ దేశాన్ని సమున్నత స్థానానికి తీసుకువెళ్లే దిశగా అనేక ఆశీస్సులు ఈ శిశుమందిరంలో దొరుకుతాయని, ఈ దేశానికి మంచి చేకూరాలని కోరారు. పాఠశాల ప్రధానాచార్యులు మాట్లాడుతూ ఈరోజు దాదాపు 150 మంది పైన చిన్నారులు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు తెలియజేశారు..
 
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు మాతాజీ కట్టా అనిత రెడ్డి, బోధన సిబ్బంది, సమితి అధ్యక్షులు దోసపాటి శ్రీనివాస్, కార్యదర్శి చిలుకూరి పరమాత్మ, కోశాధికారి పల్లెర్ల యాదగిరి, ప్రబంధకారిని అధ్యక్షులు మేడం ప్రభాకర్, కార్యదర్శి తిరందాస్ లక్ష్మీనారాయణ, ఎడ్ల తిరుమలేష్, తోగోటి రమేష్ చారి, గోవింద్ సుధాకర్, మిట్టపల్లి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు..
Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?