Half day schools: 15 నుంచి తెలంగాణ‌లో ఒంటిపూట బడులు ప్రారంభం

Half day schools: 15 నుంచి తెలంగాణ‌లో ఒంటిపూట బడులు ప్రారంభం

Half day schools: ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. మార్చి నెల‌లోనే ఎండ‌లు విప‌రీతంగా పెరుగుతున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంట వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయ‌ని వెల్ల‌డించింది. పదో తరగతి పరీక్షలకు కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం నుంచి పూట బడులను నిర్వహిస్తారని విద్యాశాఖ పేర్కొంది. ఈ స్కూళ్లలో ముందుగా మధ్యాహ్నం భోజనం అందజేసి..తర్వాత తరగతులు కొనసాగించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత.. యథావిథిగా ఒంటిపూట‌ తరగతులు నిర్వహించాలని  అన్ని పాఠశాలలకు విద్యాశాఖ‌ అదేశాలు జారీ చేసింది. ఎండల తీవ్రత ఎక్కువ‌గా ఉన్న నేపథ్యంలో విద్యార్ధులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఏప్రిల్ 24వ తేదీ ఈ విద్యాసంవత్సరానికి చివరి పని దినంగా వెల్ల‌డించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్ర‌క‌టించింది. జూన్ 12న  2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు ప్రారంభం కానున్న‌ట్లు పేర్కొంది. వేసవి సెలవుల పైన మాత్రం ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. గతం కంటే ఈ సారి వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవ‌కాశం ఉంది. ఈ విష‌యంపై ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు సైతం జారీ చేసింది. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ఇప్ప‌టికే నమోదయ్యాయి. ఈ క్ర‌మంలోనే ప్రభుత్వం పాఠశాలల్లో ఒంటిపూట బడుల నిర్వహణ పైన నిర్ణయం వెల్ల‌డించింది.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?