IAS Factory : ఆ గ్రామమంతా ఐఏఎస్ ఆఫీసర్లే.. ప్రతి ఇంట్లో ఒక కలెక్టర్.. ఒక ఐపీఎస్.. అంతమంది ఐఏఎస్‌లను చేసిన ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా?
కొందరు మాత్రం చదువుకొని పట్టణాలకు వెళ్లి ఏదో చిన్నాచితకా ఉద్యోగం చేసుకొని తమ బతుకు బండిని ముందుకు నడిపిస్తుంటారు. అయితే.. ఒకే గ్రామంలో 50కి పైగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉండటం ఎప్పుడైనా చూశారా? అసలు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అవడం అంతే అంత ఈజీ కాదు. యూపీఎస్సీ ఉద్యోగాన్ని క్రాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఉద్యోగాల్లో అది ఒకటి. సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఐఏఎస్, ఐపీఎస్ కావడం కోసం పరీక్షలు రాస్తే.. పాస్ అయ్యేది మాత్రం వందల్లోనే.

అలాంటి కఠినమైన పరీక్ష.. ఓ గ్రామంలోని యూత్ కి మాత్రం జుజుబి. వాళ్లు ఐఏఎస్ కావాలని అనుకుంటే చాలు.. ఐపీఎస్ కావాలని అనుకుంటే చాలు.. వెంటనే అయిపోతారు. ఆ గ్రామంలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అసలు ఆ గ్రామంలో ఉన్న యూత్ అంతా ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగం వైపు ఎందుకు పరిగెడుతోంది. ఎక్కువ మంది యూత్ ఎలా యూపీఎస్సీ ఉద్యోగాన్ని క్రాక్ చేయగలిగారు. అసలు ఆ ఊరు ఎక్కడుంది.. దాని నేపథ్యం ఏంటి.. అన్ని విషయాలు తెలుసుకుందాం పదండి.
ఐఏఎస్ ఆఫీసర్స్ ఎక్కువగా నార్త్ నుంచే అవుతుంటారు కదా. ఈ గ్రామం కూడా నార్త్ లోనే ఉంది. ఉత్తర ప్రదేశ్ లోని మధోపట్టి అనే గ్రామం కూడా ఉంది. ఆ గ్రామంలో ఇప్పటి వరకు 51 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అందులో కొందరు పీసీఎస్(ప్రావిన్సియల్ సివిల్ సర్వీస్) సాధించిన వాళ్లూ ఉన్నారు. అందుకే ఆ గ్రామానికి ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పేరు పెట్టారు.
ప్రతి సంవత్సరం యూపీఎస్సీ, పీసీఎస్ రాసేవాళ్లలో ఉద్యోగాలు సాధించిన వాళ్లు ఈ గ్రామం నుంచి ఖచ్చితంగా ఉంటారు. అయితే.. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలో ఉండేది కేవలం 75 ఇండ్లు మాత్రమే. అందులో ప్రతి ఇంట్లో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఐపీఎస్ లేదా పీసీఎస్ ఆఫీసర్ ఉండాల్సిందే.
ఈ గ్రామాన్ని ఎడ్యుకేషన్ హబ్ గానూ పిలుస్తారు. స్పేస్, అటామిక్ రీసెర్చ్, జ్యుడిషియల్ సర్వీసెస్, బ్యాకింగ్ లాంటి రంగాల్లో ఈ గ్రామంలోని వాళ్లు ఇప్పుడు పని చేస్తున్నారు. ఒకే ఇంట్లో నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. అయితే.. ఇలా ఈ గ్రామంలో ఎక్కువమంది ఉన్నత చదువులు చదవడం, ఉన్నతమైన ఉద్యోగాలు పొందడం వెనుక ఒక కారణం ఉంది.
1917 లో ఈ గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడు అయిన ఠాకూర్ భగ్వతి దిన్ సింగ్, ఆయన భార్య శ్యామ్ రతి సింగ్ ఇద్దరూ కలిసి పిల్లలకు చదువు నేర్పించడం ప్రారంభించారు. అది అలాగే కంటిన్యూ అవడంతో పాటు.. విద్యార్థులకు ముందు నుంచే ఉన్నత చదువుల ఆవశ్యకతను నేర్పించడం, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాల గురించి వివరించడంతో విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఆయా ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ప్రారంభించేవారు. అలా.. ఆ ఊర్లో అప్పటి నుంచే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు తయారవడం, దీంతో ఆ ఊరు దేశంలోనే మారుమోగిపోయింది.