Father difficulty work : తండ్రి కష్టం చూడలేక ఈ కొడుకు చేసిన పనిని చూస్తే శభాష్ అనాల్సిందే...

Father difficulty work : తండ్రి కష్టం చూడలేక ఈ కొడుకు చేసిన పనిని చూస్తే శభాష్ అనాల్సిందే...

 

Father difficulty work : ప్రస్తుత కాలంలో కొంతమంది యూత్ ను చూస్తే వీరికి కష్టం విలువ ఎప్పుడూ తెలుస్తుందో అని అంటాము.కానీ కొంతమంది యువత ఒకవైపు చదువుకుంటూ మరోవైపు తన తల్లిదండ్రులకు పనిలో సహాయపడుతున్నారు. యువత తలుచుకుంటే చేయలేని పని అంటూ ఉండదు.ప్రస్తుత కాలంలో యువత ముందుకు దూసుకుపోతుంది.

ప్రతి ఒక్క యువత ఏదో ఒక రకంగా తన టాలెంట్ నిరూపించుకుంటుంది.తమ తల్లిదండ్రుల కష్టం తెలుసుకొని ప్రతి ఒక్కరూ వాళ్లకు సహాయం చేస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు.మరి యూత్ అంటే ఎనర్జీ,గుండె ధైర్యం,ట్రిగ్గర్ నొక్కిన గన్ లా దూసుకుపోవటానికి సిద్ధంగా ఉండే వారే యూత్.వాళ్ళ ఆలోచనలో మెరుపు వేగం, చేతుల్లో చురుకుదనం ఏదైనా చేసి చూపించే సత్తా వాళ్ళ సొంతం.

అందుకే ఎవరితోనైనా పెట్టుకో కానీ యూత్ తో పెట్టుకోవద్దు అని కొందరు అంటుంటారు.అది నిజమే మరి.యువత సాధించలేనిది ఏది ఉండదు.అందుకే వాళ్లకి ఒక దినోత్సవం కూడా ఉంది. అదే అంతర్జాతీయ దినోత్సవం. ఓ కొడుకు వాళ్ళ నాన్న కష్టాన్ని చూసి తట్టుకోలేక ఒక పని చేశాడు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 పంచర్ షాప్ వీరి జీవన ఆధారం 30 ఏళ్లుగా ఇదే పనిచేస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తున్నాడు నాగేశ్వరరావు. అయితే నాగేశ్వరరావుకు ఒకరోజు అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది.ఆ ప్రమాదంలో నాగేశ్వరరావుకి కాలికి బలంగా గాయం తగలడంతో ఏ పని చేయలేకపోతున్నాడు. కానీ పంచర్ షాప్ తీయకపోతే  ఇంట్లో దేనికి వెసులుబాటు కాదు.

296 -2

దీంతో మెల్లగా వెళ్లి పంచర్ షాప్ తీసి పంచర్ల వేయటం మొదలుపెట్టాడు. పనిచేసే టైములో చిన్న చిన్న పరికరాలు తీసుకోవటానికి కాళ్ళు నొప్పితో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.దీనిని చూసిన నాగేశ్వరరావు కొడుకు భగత్ మనసు చలించింది. నాన్న కష్టాన్ని సులువైన పనిగా మార్చటానికి ఒక పరికరానికి భగత్ శ్రీకారం చుట్టాలి అనుకున్నాడు.

అంతే షాపులోని పనికిరాని వస్తువులన్నీ తీసుకొని ఒక వీల్ చైర్ ను తయారు చేశాడు.ఈ వీల్ చైర్ వలన తన పని సులువుగా మారిందని నాగేశ్వరరావు తెలిపారు. భగత్ పనికిరాని వస్తువులన్నిటిని తీసుకొని రీసైక్లింగ్ చేస్తూ ఎన్నో పరికరాలకు శ్రీకారం చుట్టాడు. రైతులకు ఉపయోగపడే పరికరాలు, ఎలక్ట్రిక్ స్కూటీ, ఎయిర్ పిస్టన్ ఇలా ఎన్నో పరికరాలు తయారు చేసి ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నాడు.

గత కొద్ది రోజుల నుండి వేరే ప్రాజెక్టు చేస్తుండగా నాన్న నాగేశ్వరరావుకు ప్రమాదం జరగటంతో రొటేటింగ్ చైర్ తయారు చేసినట్లు భగత్ తెలిపారు.రీసైక్లింగ్ చేసి తయారు చేసిన రొటేటింగ్ చైర్ చిన్న చిన్న పనులు చేసుకునే వారికి ముఖ్యంగా కాళ్లు నొప్పులు ఎక్కువగా ఉన్నవారికి మాటిమాటికి కూర్చున్న చోటు నుండి లేవకుండా మన చుట్టు పక్కల ఉన్న వస్తువులు రొటేట్ అవుతూ తీసుకోవచ్చు.

దీనివల్ల పనులు కూడా ఎంతో సులువుగా అయిపోతాయి. ఇది కాళ్లు నొప్పులు ఉన్నవాళ్లు మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే మహిళలు కూడా బట్టలు పిండే సమయంలో వంట పాత్రలు కడిగే సమయంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?