Jobless Chai wali : మూడు నెలల నుంచి కంపెనీ జీతం ఇవ్వలేదని జాబ్‌లెస్ చాయి వాలీ పేరుతో టీ స్టాల్ పెట్టిన 25 ఏళ్ల యువతి.. ఎక్కడో తెలుసా?
కానీ.. కొందరికి పని చేయాలంటే బద్దకం అడ్డు వస్తుంటుంది. కొందరైతే అస్సలు పని చేయరు. ఇంట్లోనే ఉదయం నుంచి రాత్రి దాకా ఉంటారు కానీ పని మాత్రం చేయరు. కొందరు బాగా చదువుకున్నా ఉద్యోగాలు లేక చిన్నచిన్న పనులు చేసుకుంటూ తమ జీవితాన్ని వెళ్లదీస్తుంటారు.
నేను చాలా ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. కానీ.. లక్నోలో నాకు ఉద్యోగం పొందడం చాలా కష్టంగా మారింది. అప్పుడే నాకు నేనే ఎందుకు ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకూడదు అనే ఆలోచన కలిగింది.. అని వారణాసికి చెందిన పూజా యాదవ్ తెలిపింది. తనది వారణాసి కానీ.. తను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉంటోంది. తనకు లక్నో దాటి జాబ్ కోసం బయటికి వెళ్లాలని లేదట. దీంతో తన సొంత టీ స్టాల్ నే లక్నోలో ఓపెన్ చేసింది
పూజా యాదవ్. నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. అందుకే.. చిన్నగానే చాయి స్టాల్ ను ప్రారంభించా.. అని పూజా యాదవ్ చెప్పుకొచ్చింది. అయితే.. ఈ టీ స్టాల్ పెట్టిన ఆరు నెలల వరకు తన కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియకుండా దాచిపెట్టింది పూజా యాదవ్. మా ఇంట్లో నేను జాబ్ చేస్తున్నా అనుకున్నారు. కానీ.. నేను చాలా నెలల పాటు ఉద్యోగం చేయలేదు.
లక్నోలో ఉద్యోగం చేయకుండా ఎన్నాళ్లు బతుకుతాం.. అంటూ మీడియాకు తెలిపింది పూజా. ఇప్పుడు పూజా యాదవ్ ఇద్దరు వర్కర్లను పెట్టుకొని టీ స్టాల్ ను నడుపుతోంది. ఇదివరకు జాబ్ చేసినప్పుడు తను రూ.15 వేలు నెలకు సంపాదించేది. కానీ.. ఇప్పుడు 15 వేల కంటే ఎక్కువే సంపాదిస్తోంది. భవిష్యత్తులో టీ స్టాల్ చైన్స్ ను తీసుకొచ్చి కేప్, రెస్టారెంట్ పెట్టాలనేది పూజా ప్లాన్.
రోజూ అర్ధరాత్రి వరకు టీ స్టాల్ లో వర్క్ చేస్తుంది పూజా యాదవ్. నిజానికి పూజలా చాలామంది ఈ మధ్య ఆలోచిస్తున్నారు. మన దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా ఓవైపు, నిరుద్యోగం మరోవైపు నేటి యూత్ ను వేధిస్తున్నాయి. అందువల్ల వెయ్యి మందిలో పది మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు.
చాలామంది ఉద్యోగాల వెంట పడకుండా తమకు ఉన్న స్కిల్స్ ను ఉపయోగించుకొని పూజా యాదవ్ లా తమ కాళ్ల మీద తాము నిలబడేలా తమకు నచ్చిన వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. కొన్నేళ్ల పాటు కష్టపడితే ఆ వ్యాపారం ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తుంది. ఒకరి కింద బానిసలా పనిచేసేకంటే.. మీకు నచ్చిన పనిని ఎంతో సంతోషంగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా చేసుకోవడంలో ఉన్న సంతృప్తి వేరు.