నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 18 (క్విక్ టుడే) : పదోతరగతి విద్యార్థులలో టాలెంట్ టెస్ట్‌లు భయాన్ని దూరం చేస్తాయని నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ నల్గొండ జిల్లా, టాలెంట్ టెస్ట్ పరీక్షను నల్గొండ పట్టణ కేంద్రంలో కొన్ని సెంటర్లలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి హాజరై గౌతమ్ మోడల్ స్కూల్లో ప్రశ్న పత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి శివరాం రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ భవిష్యత్తులో జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల కంటే ముందు ఇలాంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఎప్పుడూ పోరాటాలకే కాకుండా ఇలాంటి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం. హర్షించదగ్గ విషయం అన్నారు. విద్యార్థులందరూ ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. ఇలాంటి టాలెంట్ టెస్ట్‌ల్లో ప్రతి ఒక్కరూ మంచి ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో మంచి పాయింట్స్ సాధించాలన్నారు.

విద్యార్థులందరూ శ్రమించి చదివితే విజయం అనేది బానిసవుతుందని పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రతిభ పరీక్షల్లో పాల్గొనడం వల్ల ఇప్పటివరకు ఎంత చదివాం.. ఇంకా ఏవిధంగా చదివితే విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామనే విషయం తెలుస్తుందన్నారు. ఈ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ అడ్వాన్సుగా శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు, మారకద్రవ్యాలకు దూరంగా ఉండాలని గుట్కా పాన్ లాంటి చెడు అలవాట్లను దూరంగా ఉండాలని హితబోధ చేశారు. ఉన్నతమైన లక్షణాలతో మంచి క్రమశిక్షణ భావంతో మెలగాలని కోరారు. విద్యార్థులు అందరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే కచ్చితంగా విజయం సాధించవచ్చు అని చెప్పారు. మన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ చెప్పినట్టు కలలను కంటూ సహకారం చేసుకునే విధంగా విద్యార్థుల కృషి ఉండాలని అన్నారు. నల్లగొండ పట్టణం, పరిసర ప్రాంతాల నుండి జిల్లా వ్యాప్తంగా రాసే ఈ పదో తరగతి పరీక్షలలో సుమారు 6వేల మంది విద్యార్థులు పాల్గొనడం పదో తరగతి పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి మంచి పారితోషకాలు అందించడం జరుగుతుంది అన్నారు.
విద్యార్థులందరూ ఇప్పుడున్న సమయం మొత్తం పరీక్షల సమయం కాబట్టి సమయాన్ని వృథా చేయకుండా బాగా కష్టపడి చదవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో జరగబోయే పదో తరగతి పరీక్షలు మంచి మార్కులు సాధించి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ మీరు పుట్టిన గ్రామానికి మండలానికి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, గౌతమి మోడల్ విద్యా సంస్థల చైర్మన్ రమేష్ ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య, రాష్ట్ర గర్ల్స్ కమిటీ సభ్యురాలు స్పందన, శిరీష, శ్రీధర్ కల్పన ,రాధిక, అంజలి, బిందు మాధవి, దేవి, రేణుకా తదితరులు పాల్గొన్నారు.