TS EAMCET 2024 : తెలంగాణ ఎంసెట్ రాస్తున్నారా? పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష వాయిదా.. ఐసెట్, ఈసెట్ కూడా పోస్ట్‌పోన్.. కొత్త తేదీలు ఇవే 

TS EAMCET 2024 : తెలంగాణ ఎంసెట్ రాస్తున్నారా? పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష వాయిదా.. ఐసెట్, ఈసెట్ కూడా పోస్ట్‌పోన్.. కొత్త తేదీలు ఇవే 

TS EAMCET 2024 : దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. త్వరలో దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా అదే రోజు జరగనున్నాయి. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఎన్నికల కారణంగా రెండు విడతల్లో ఐపీఎల్ ను నిర్వహిస్తున్నారు.

తొలి విడత ఐపీఎల్ మాత్రం ఇండియాలోనే జరుగుతోంది. రెండో విడత మాత్రం ఎక్కడ జరుగుతుందో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇలా.. ఒక్క రంగంలోనే కాదు.. ఎన్నికల కారణంగా చాలా రంగాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఎండాకాలం అంటే చాలు పలు కాంపిటేటివ్ పరీక్షలను నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా సెట్ పరీక్షలు ఉంటాయి. ఏ రాష్ట్రంలో అయినా అవి కామన్. 

తెలంగాణలో కూడా మార్చి నుంచి మే, జూన్ వరకు ఎంసెట్, ఐసెట్, లాసెట్, ఈసెట్ లాంటి పరీక్షలను యూనివర్సిటీలు, విద్యా శాఖ నిర్వహిస్తుంది. ఇప్పటికే పలు పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. కానీ.. త్వరలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ పరీక్షల షెడ్యూల్ ను మార్చాల్సి వచ్చింది. పలు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నారు. తెలంగాణలో ఎంసెట్ పేరు మారిన విషయం తెలిసిందే.

తెలంగాణలో ఇప్పుడు ఎంసెట్ ను ఈఏపీసెట్ గా పిలుస్తున్నారు. ఈఏపీ సెట్ అంటే.. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీ) సెట్ గా పిలుస్తున్నారు. మెడిసిన్ కోసం డైరెక్ట్ గా నీట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎంసెట్ నుంచి మెడిసిన్ ఎంట్రెన్స్ ను తీసేయడంతో ఇప్పుడు ఎంసెట్ కేవలం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ చదివే విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది.  మెడిసిన్ చదివే విద్యార్థులు నీట్ రాస్తారు.

23 -3

నీట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి అందులో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మెడిసిన్ సీటు లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీల్లో సీటు పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే కాంపిటిషన్ ఎక్కువగా ఉంటుంది.  అయితే.. నీట్ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ మార్పు గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. కేవలం తెలంగాణ ఈఏపీ సెట్ పరీక్ష షెడ్యూల్ లో మాత్రం మార్పులు చోటు చేసుకున్నాయి. 

TS EAMCET 2024 : కొత్త తేదీలను ప్రకటించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి

తెలంగాణ ఎంసెట్, ఐసెట్, ఈసెట్ లను తెలంగాణ ఉన్నత విద్య మండలి నిర్వహిస్తుంది. దాని ఆధ్వర్యంలోనే ఈ పరీక్షల నిర్వహణ జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల అయినా.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్పులు చేసినట్టు టీఎస్సీహెచ్ఈ ప్రకటించింది. 

23 -2

కొత్త షెడ్యూల్ ప్రకారం.. తెలంగాణ ఎంసెట్ లో భాగంగా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో జరగనున్నాయి. ఇక.. ఎంసెట్ లో భాగంగా అగ్రికల్చరల్, ఫార్మసీ ఎగ్జామ్స్ మే 7, 8 తేదీల్లో జరగనున్నాయి.

ఇక.. తెలంగాణ ఐసెట్ పరీక్షను జూన్ 4, 5 వ తేదీన నిర్వహించాలని భావించినా.. జూన్ 5, 6 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు విద్య మండలి ప్రకటించింది.  ఈసెట్ మే నెలలో 9, 12 వ తేదీన జరగాల్సి ఉంది. కానీ.. కొత్త తేదీల ప్రకారం మే 7 నుంచి 11 తేదీల వరకు జరుగుతాయి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?