Zomato Delivery Boy : జొమాటో ఫుడ్ డెలివరీ చేస్తూ బైక్ మీదే సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న డెలివరీ బాయ్.. నెటిజన్లు ఏమన్నారంటే?

Zomato Delivery Boy : జొమాటో ఫుడ్ డెలివరీ చేస్తూ బైక్ మీదే సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న డెలివరీ బాయ్.. నెటిజన్లు ఏమన్నారంటే?

Zomato Delivery Boy : ఈరోజుల్లో చిన్న ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే ఎంతో శ్రమించాలి. చాలా కష్టపడాలి. కోచింగ్ లు తీసుకోవాలి. హాస్టల్స్ ఉండాలి. సిటీల్లో ఉండి కోచింగ్ తీసుకోవడం అంటే మాటలు కాదు. నెలకు కనీసం ఏ సిటీలో ఉన్నా 10 వేలు ఈజీగా అవుతాయి. మరి ఆ డబ్బు ఎవరు ఇస్తారు? అమ్మానాన్నకు ఏదైనా జాబ్ ఉంటే పర్లేదు కానీ.. వాళ్లు కూడా పేదవాళ్లు అయితే నెలకు రూ.10 వేలు పంపించి తమ పిల్లలకు కోచింగ్ ఇప్పించేంత ఆర్థిక స్థోమత వాళ్లకు ఉండదు.

అందుకే చాలామంది యూత్ తమ కాళ్ల మీద తామే నిలబడుతున్నారు. సిటీలకు వెళ్లి కోచింగ్ లు తీసుకున్నా తీసుకోకున్నా.. ఏదో ఒక చిన్న పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ తమ అవసరాలకు కావాల్సిన డబ్బును తామే సంపాదించుకుంటున్నారు. ఒకప్పుడు ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ చేయాలంటే చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. ఎవ్వరూ ఇచ్చేవారు కాదు. కానీ.. నేడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. చాలా జాబ్స్ ఉన్నాయి.

ఒక బైక్ ఉన్నా చాలు. ఎన్నో ఉద్యోగాలు చేయొచ్చు. ఒక బైక్, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. చాలామంది బైక్ ట్యాక్సీల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ గానూ చేస్తున్నారు. అలా ఓ యువకుడు కూడా సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. సివిల్స్ కు ప్రిపేర్ అవడం అనేది మాటలు కాదు కదా. దానికి చాలా శ్రమించాలి.

ఎంతో కష్టపడాలి. ఏళ్లకు ఏళ్లు చదవాలి. అందుకే ఓ యువకుడు జొమాటో డెలివరీ బాయ్ గా పని చేస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. ఫుడ్ డెలివరీ చేసే సమయంలో కూడా స్మార్ట్ ఫోన్ లో యూపీఎస్సీకి సంబంధించిన వీడియోలు చూస్తూ వెళ్తున్నాడు. ట్రాఫిక్ జామ్ అయితే ఆ సమయంలో కూడా సివిల్స్ కు సంబంధించిన వీడియోలే చూస్తున్నాడు. ఎంతో అటెన్షన్ తో యూపీఎస్సీ లెక్చర్స్ ను ఆ యువకుడు వింటున్నాడు.  

3101 -1

Zomato Delivery Boy : ఇంతకు మించిన మోటివేషన్ ఉంటుందా?

ఆ యువకుడు ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో వెంటనే తన మొబైల్ లో సివిల్స్ కు సంబంధించిన వీడియోలను ఆన్ చేసుకొని ఎంతో జాగ్రత్తగా వింటూ ఉంటాడు. ఆ యువకుడి బైక్ పక్కనే ఉన్న ఆయుష్ సంఘీ అనే వ్యక్తి వీడియో తీసి.. కష్టపడి చదవాలి అని చెప్పేందుకు ఇంతకంటే బెస్ట్ మోటివేషన్ ఇంకేం ఉంటుంది అని క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. 

ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే బైక్ మీద చదువు ఏంటి అంటూ హేళన చేయగా.. మరికొందరు చదువు విలువ తెలిసిన వాళ్లు ఒక్క నిమిషం కూడా వృథా చేయరు. తమ లక్ష్యం కోసం ఎక్కడ ఉన్నా సరే.. పోరాడుతూనే ఉంటారు.

తమ లక్ష్యం చేరుకునే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అస్సలు పట్టించుకోరు.. అంటూ నెటిజన్లు తమకు నచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నేటి యూత్ తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఉన్న రిసోర్సులను కూడా ఉపయోగించుకుంటున్నారు. అందుకే దేశంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్ష సివిల్స్ ను చేధించడానికి ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడటం లేదు.  

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?