Iran Attacks Israel : ఇజ్రాయిల్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి.. ఇరాన్ జనరల్ హత్యకు ప్రతీకారంగానే ఈ దాడి

Iran Attacks Israel : ఇజ్రాయిల్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి.. ఇరాన్ జనరల్ హత్యకు ప్రతీకారంగానే ఈ దాడి

Iran Attacks Israel : ప్రపంచమంతా యుద్ధాలతో కొట్టుకుంటోంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ వార్ చూశాం. ఆ వార్ ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఆ వార్ మాత్రం ఆగలేదు. ఇప్పటికీ ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరోవైపు హమాస్ దాడి కూడా ప్రపంచాన్ని కుదిపేసింది.

ఈ దాడి వల్ల ఇజ్రాయిల్, గాజా మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది. దీని వల్ల.. ఇజ్రాయిల్ గాజాపై చేసిన దాడికి గాజా మొత్తం అతలాకుతలం అయింది. సిరియాలో జరిగిన ఇరాన్ జనరల్ హత్యకు కారణం ఇజ్రాయిల్ అని ఇరాన్ ముందు నుంచి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 

అందుకే.. ఎలాగైనా ఇజ్రాయిల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చాలా రోజుల నుంచి కత్తులు నూరుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయిల్ పై ఇరాన్.. డ్రోన్లతో దాడిని షురూ చేసింది. 200 డ్రోన్లు, మిసైల్స్ ను ఇజ్రాయిల్ వైపు పంపించింది. ఆ డ్రోన్స్, బాలిస్టిక్ మిసైల్స్, క్రూస్ మిసైల్స్.. ఇజ్రాయిల్ లో పలు ప్రాంతాలను ధ్వంసం చేసేందుకు ఇరాన్.. ఇజ్రాయిల్ వైపు పంపించింది. 

Iran Attacks Israel : ఇరాన్ దాడిని ఎదుర్కొనేందుకు మేము సిద్ధం అంటూ ప్రకటించిన ఇజ్రాయిల్

అయితే.. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్స్, మిసైల్స్ దాడిని తాము తిప్పికొడతామని.. ఇప్పటికే కొన్ని డ్రోన్స్ ను బోర్డర్ దాటగానే అడ్డుకున్నామని ఇజ్రాయిన్ ఆర్మీ ప్రకటించింది. ఇంకా కొన్ని డ్రోన్స్ తమ బోర్డర్ దాటి రాలేదని.. వాటిని ఎదుర్కునేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 

142 -2

సిరియా, జోర్డాన్ మీదుగా.. ఇజ్రాయిల్ వైపు వస్తున్న కొన్ని డ్రోన్స్ ను ఇప్పటికే ఇజ్రాయిల్ కూల్చేసినట్టు తెలుస్తోంది. అలాగే.. ఇజ్రాయిల్ తో పాటు జోర్డాన్, ఇరాక్, లెబనాన్ దేశాలు తమ ఎయిర్ వేను మూసేశాయి. దీంతో సిరియా, జోర్డాన్ కూడా తమ ఎయిర్ ఫోర్స్ ను అలర్ట్ చేశాయి. 

అయితే.. ఇటీవల సిరియాలో ఉన్న ఇరాన్ కాన్సులేట్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఇరాన్ జనరల్ మృతి చెందారు. ఆయనతో పాటు పలువురు సీనియర్ అధికారులు కూడా మృత్యువాత పడ్డారు. 

ఇరాన్ కాన్సులేట్ భవనంపై దాడి చేసింది ఇజ్రాయిల్ అని.. దానికి కారణం అయిన ఇజ్రాయిల్ దేశాన్ని అస్సలు వదిలిపెట్టబోమని ఇరాన్ శపథం చేసింది. ఖచ్చితంగా ఇజ్రాయిల్ దాడికి సిద్ధమవ్వాలి.. మేము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే పలు మార్లు హెచ్చరించింది. 

హెచ్చరించినట్టుగానే ఇరాన్.. తాజాగా డ్రోన్స్, మిసైల్స్ తో ఇజ్రాయిల్ పై విరుచుకుపడింది. ఇరాన్ డ్రోన్స్ దాడి వల్ల ప్రస్తుతానికి ఇజ్రాయిల్ కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. 

142 -3

ఇజ్రాయిల్ పై జరిగిన దాడిని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఖండించారు. ఇజ్రాయిల్ కు తన మద్దతు పలికారు. ఇరాన్ డ్రోన్స్ దాడి గురించి తెలియగానే వెంటనే మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఈ సంక్షోభంపై యూఎస్ అత్యున్నత సెక్యూరిటీ అధికారులతో భేటీ అయ్యారు. 

ఇప్పుడే మా నేషనల్ సెక్యూరిటీ టీమ్ తో భేటీ అయ్యాను. ఇరాన్.. ఇజ్రాయిల్ పై దాడి చేసినట్టు తెలిసింది. ఇరాన్ దాడి నుంచి ఇజ్రాయిల్ ను కాపాడేందుకు మా ప్రయత్నాలు మేము చేస్తాం.. అన్నారు. 

ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ తో త్వరలోనే బైడెన్ ఫోన్ లో మాట్లాడి.. ఈ దాడిని ఎలా ఎదుర్కోవాలో చర్చించనున్నారు. యూఎస్ కూడా ఇజ్రాయిల్ కు మద్దతు ఇవ్వడంతో.. ఇజ్రాయిల్.. ఇరాన్ దాడిపై అంతగా ఉలిక్కిపడిన సందర్భాలు లేవు. ఆ డ్రోన్లను ఎదుర్కునే సత్తా తమ దగ్గర ఉందని ఇజ్రాయిల్ ఇప్పటికే స్పష్టం చేసింది. 

మరోవైపు ఇరాన్ దాడిని యురోపియన్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, మెక్సికో, డెన్ మార్క్, నార్వే, నెదర్లాండ్స్ ఖండించింది. ఐక్యరాజ్యసమితి కూడా ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది. ఇరాన్ దాడిని ఖండించింది. ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి తర్వాత.. టెహ్రాన్ లోని పాలెస్తినా స్కైర్ వద్ద ఇరాన్, పాలస్తీనా జెండాలతో పలువురు ఇరాన్ ప్రజలు సంబురాలు చేసుకున్నారు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?