Zhang Yudong: వందల కోట్ల ఆస్తులు ఉన్నా.. ఏమీ లేవని అబద్ధం చెప్పి... ఒక సామాన్యుడిలా కొడుకును పెంచిన తండ్రి..
తనకు వందల కోట్లు ఆస్తులు ఉన్న విషయం దాచిపెట్టి కొడుకును సామాన్యుడులాగా పెంచాడు. ఒక తండ్రి కొడుకుకు 20 ఏళ్లు వచ్చేవరకు ఈ రహస్యాన్ని దాచి పెట్టాడు. ఇటీవలే తన ఆస్తుల గురించి తన కొడుక్కి తెలియజేశాడు. ఆయనే చైనాకు చెందిన మాల ప్రిన్స్ బ్రాండ్ అధిపతి జాంగ్ యుడాంగ్. ఆయనకు రూ. 690 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన మాల ప్రిన్స్.చైనాలో ప్రముఖ వ్యాపార సంస్థలలో ఆయన ఒక్కడు.
వాటితో అప్పులు తీర్చాలని అనుకున్నాను.ఆ టైంలోనే మా నాన్న మాకు ఉన్న ఆస్తుల గురించి రహస్యం బయటపెట్టాడు అని జాంగ్ జిలాంగ్ తెలిపారు.తన ఆస్తుల గురించి రహస్యాలు బయట పడిన తర్వాత తన కుటుంబం రూ.11 కోట్లు ఖరీదైన వీ ల్లాలోకిమారినట్లు తెలిపారు. సామాన్య వ్యక్తిగా పెరగటం వల్ల తన జీవితంలో విజయాలు సాధించటం కోసం కష్టపడిపని చేస్తారు అనేది తన తండ్రి అభిప్రాయం..
ఆయన కొడుకు పెంపకంలో కూడా అదే సూత్రాన్ని అనుసరించారు. ఇక వందల కోట్ల ఆస్తులు గురించి తెలిసిన సంస్థ బాధ్యతలను అప్పగించే విషయంలో తన కొడుకుకి కూడా కొన్ని షరతులు పెట్టాడు.తన సమర్థతను నిరూపించుకోవాలి అని తెగేసి చెప్పటం ఒక విశేషం.
మాల ఫ్రెండ్స్ ఈ కామర్స్ విభాగంలో పనిచేస్తున్న జాంగ్ తన పనితీరు నచ్చితేనే సంస్థల బాధ్యతలు అప్పజెప్పే విషయంలో తన తండ్రి ఆలోచిస్తాను అని చెప్పినట్లుగా తెలిపాడు. ఎంతో స్ఫూర్తినిచ్చే ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీంతో కొంతమంది తమ భిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
ఇదంతా నమ్మేలా లేదు కల్పితం లాగా ఉంది అని ఒకరు అంటే.. దీనిని నేను కచ్చితంగా నమ్ముతానని మరొకరు అన్నారు. ఈ బ్రాండ్ ప్రస్తుత కాలంలో ప్రకటనలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ప్రిన్స్ గార్డియేషన్ పూర్తి కావడం వల్లనెమో అని మరి కొందరు అంటున్నారు. కొడుక్కి 100 కోట్లు ఉన్న విషయం తెలిస్తే బాధ్యత తెలియదు అని కొంతమంది ప్రశంసించారు..