Baltimore bridge collapse: అమెరికాలో బ్రిడ్జిని ఢీకొట్టిన భారీ నౌక.. నదిలో పడిపోయిన వాహనాలు

Baltimore bridge collapse: అమెరికాలో బ్రిడ్జిని ఢీకొట్టిన భారీ నౌక.. నదిలో పడిపోయిన వాహనాలు

Baltimore bridge collapse :: అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ఘోర ప్రమాదం సంభవించింది. పటాప్‌స్కో న‌దిలో వాహన కంటైనర్లతో వెళ్తున్న ఓ భారీ నౌక పవర్ ఫెయిల్యూర్ కార‌ణంగా అదుపు తప్పి నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని బ‌లంగా ఢీకొట్టింది. దీంతో ఆ వంతెన కుప్పకూలిపోయింది. ఆ స‌మ‌యంలో బ్రిడ్జీపై వెళ్తున్న వాహనాలు న‌దిలోప‌డి నీటిలో మునిగిపోయాయి.

ఆ వాహ‌నాల్లో ప్రయాణిస్తు న్న వాహ‌న‌దారులు గల్లంతయ్యారు. ప్రమాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆరుగురు కార్మికులు బ్రిడ్జీపై గుంత‌లు పూడుస్తున్నారు. ఈ సిబ్బంది కూడా నదిలో పడిపోయారు. వంతెన కూలిన ప్ర‌మాదంలో అధికారులు ఇద్దరిని కాపాడారు. ఈ ప్ర‌మాదంలో న‌దిలో ప‌డిపోయిన వాహ‌నాలు 15 మీటర్ల లోతులో ప‌డిపోయాయి. గ‌ల్లంతైన వారి వివ‌రాలు ఇంకా తెలియ‌లేద‌ని అక్క‌డి అధికారులు పేర్కొన్నారు.

270 -2

నీళ్లు కూడా బాగా చల్లగా ఉండటంతో కార‌ణంగా వారంతా దుర్మరణం చెందే అవ‌కాశం ఉంటుంద‌ని వారు భావిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ దుర్ఘటన జరిగ‌డంతో ప్ర‌మాద తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంది. కాగా నౌకలోని సిబ్బంది మొత్తం భారతీయులే కావ‌డం విశేషం.

నౌకలో విద్యుత్ అంత‌రాయం ఏర్ప‌డ‌గానే వారు హుటాహుటిన ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో ప్ర‌మాద తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన‌ అధికారులు వాహనాల‌ను బ్రిడ్జి పైకి వెళ్లకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. అంతేకాకుండా అర్ధ‌రాత్రి ప్రమాదం సంభ‌వించ‌డంతో బ్రిడ్జిపై ట్రాఫిక్ కూడా పెద్ద‌గా లేదు. ప్ర‌మాదం జ‌రిగిన సమయంలో నౌక గంటకు 15 కి.మీ. వేగంతో ప్ర‌యాణిస్తోంది.

విద్యుత్ అంత‌రాయం కార‌ణంగా ఒక్క‌సారిగా అదుపు తప్పి శరవేగంగా బ్రిడ్జికేసి దూసుకొచ్చి పిల్ల‌ర్‌ను  ఢీకొట్టింది. దీంతో 2.6 కి.మీ. పొడ‌వు ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా క్ష‌ణాల్లోనే కూలిపోయింది. నౌకలో మంటలు చెలరేగ‌డంతో దట్టమైన పొగలు క‌మ్ముకున్నాయి. ఈ ప్ర‌మాదం జ‌రిగిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇది అనూహ్య ఘ‌ట‌న అని మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ పేర్కొన్నారు.

270 -3

ఈ ప్ర‌మాదం జ‌రిగిన తీరు సినిమా షూటింగ్ సీన్‌ను త‌ల‌పించింద‌ని బాల్టిమోర్ మేయర్ బ్రాండన్ స్కాట్ పేర్కొన్నారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా అని ప్రాథ‌మికంగా తెలిసిన కార‌ణం అయిన్ప‌టికీ దీనిపై లోతుగా ద‌ర్యాప్తు చేప‌డుతామ‌ని ఆయ‌న మీడియాతో తెలిపారు. ప్ర‌మాదానికి గురైన గ్రీస్ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన డాలీ నౌక సినర్జీ మెరైన్ గ్రూప్ నిర్వ హణలో ఉంది.

ప్రఖ్యాత డెన్మార్క్ షిప్పిం గ్ కంపెనీ 'మెర్క్స్'కు 'కు చెందిన సరుకుతో బాల్టి మోర్ రేవు నుంచి శ్రీలం క రాజధాని కొలంబోకు ఈ నౌక వెళ్తోంది. ఈ నౌక‌లో ఇద్ద‌రు పైలెట్లు స‌హా మొత్తం 22 మంది సిబ్బంది భార‌తీయులే సిన‌ర్జీ మెరైన్ గ్రూప్ తెలిపింది. అయితే వీరంతా ప్ర‌మాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌మాదానికి గురైన‌ ఈ బ్రిడ్జినీ 1977లో నిర్మించారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?