Bird Flu in America: అమెరికాకు పొంచి ఉన్న మరోముప్పు.. పశువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదకర బర్డ్ ఫ్లూ
అమెరికాలోని టెక్సాస్ మరియు కాన్సస్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ వ్యాధి శరవేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ ఈ వ్యాధి ఆవుపాల ద్వారా సోకుతుందని సమాచారం. ఇక ఈ బర్డ్ ఫ్యూ వ్యాధి సోకితే ఎలా అనే భయం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అయితే అమెరికాలోని చాలా ఆవులు హెచ్5ఎన్1 టైపు ఏ బారిన పడ్డాయని వార్తలు సంచలనంగా మారాయి.
ఈ నేపథ్యంలోనే అమెరికాలో విస్తరిస్తున్న ఈ బర్డ్ ఫ్యూ నివారణకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటారని అంటున్నారు. అయితే గతంలో వచ్చిన కరోనా వ్యాధి వలన ప్రపంచం మొత్తం ఎంతలా ఆందోళన చెందిందో మనందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రజలలో విపరీతమైన భయాందోళనను కలిగిస్తుంది.
బర్డ్ ఫ్లూ కూడా కరోనా వ్యాధి రేంజ్ లో భయపెడితే ఎలా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందుకే వీలైనంత త్వరగా దీనిని నివారించాలని పలువురు కోరుతున్నారు. ఇక ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యలపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఈ బర్డ్ క్యూ వ్యాధి అనేది జంతువుల నుండి సోకే వ్యాధి కావడం వలన పెంపుడు జంతువుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అప్పుడప్పుడు వాటికి టీకాలు వేయిస్తూ ఉండాలి. ఎలాంటి అనుమానం కలిగిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ క్రమంలోనే అగ్రరాజ్యంలో విపరీతంగా విస్తరిస్తున్న బర్డ్ బ్లూ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వ్యాధి తీవ్రత విపరీతంగా పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లుగా అగ్రరాజ్య అధికారులు చెబుతున్నారు. అయితే కరోనా వ్యాధి మాదిరిగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరించక ముందే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు ప్రముఖులు అగ్ర రాజ్యాన్ని కోరుతున్నారు. మరి ఈ బర్డ్ ఫ్యూ వ్యాధిపై అమెరికా ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.