Cai Guo-Qiang's Sky Ladder :  ఆకాశంలో నిప్పుల నిచ్చెన‌.. 1/2 కిలోమీటర్ ఎత్తు వరకు పేలిన ప‌టాకులు

Cai Guo-Qiang's Sky Ladder :  ఆకాశంలో నిప్పుల నిచ్చెన‌.. 1/2 కిలోమీటర్ ఎత్తు వరకు పేలిన ప‌టాకులు

Cai Guo-Qiang's Sky Ladder : ఆకాశానికి నిచ్చెన వేస్తే ఎలా ఉంటుంది. ఊహ బాగానే ఉంది. కానీ ఆకాశానికి నిచ్చెన వేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా.? మనిషి తలుచుకుంటే సాధ్యం కాని పని అంటూ ఏమైనా ఉన్నదా. నేటి కంప్యూటర్ యుగంలో ప్రతిదీ సాధ్యమేనని రుజువు చేశాడు ఒక ఆర్టిస్ట్. ఆకాశానికి కాదు ఏకంగా స్వర్గాన్ని టార్గెట్ చేశాడు.

ఇంకేం అనుకున్నదే తడువుగా స్వర్గానికి నిచ్చెన వేసేసాడు. అయితే దానిని మనం ఎక్కలేం. ఎందుకు అంటే అది నిప్పుల నిచ్చెన. మరి అదేంటి అని అనుకుంటున్నారా. అవును ఇతను ఆకాశానికి నిప్పుల నించెన వేశాడు. ఇదేదో చందమామ కథ, బేతాళ కథో అని అనుకునేరు.

నిజంగానే  ఇలలో జరిగిన సంఘటన. నమ్మశక్యం కాకపోతే ఇదిగో ఈ వీడియో చూసేయండి. ఈ క‌ళాకారుడు రూపొందించిన‌ వీడియోకు సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

157 -1

అరోరా బొరియాలిస్ ఆకాశంలో అద్భుతం సృష్టించగా కొత్తగా మరో అద్భుతం విశేషంగా నిలిచింది. ఎర్రని నిప్పుల సెగ కక్కుతున్న నిచ్చెన మెట్ల వెలుగులు ఆకాశం వైపు దూసుకు వెళ్లటం నెట్టింట చక్కర్లు కొడుతుంది. విషయం ఏమిటి అంటే ఈ వీడియో పదేళ్ల కిందటిది. చైనీస్ బాణాసంచా కళాకారుడు  దీనిని రూపొందించారు.

ఇది ఆకాశంలో సుమారు అర కిలోమీటర్ ఎత్తు వరకు నిప్పుల నిచ్చెన ఆకారంలో టపాసులు పేలుతూ అద్భుతంగా మారింది. అయితే చైనాలోని ఓ టపాసుల కళాకారుడికి క్రియేటివిటీకి నేటిజన్ లు ఎంతో ఫిదా అయ్యారు. ఆకాశంలోకి సుమారు అర కిలోమీటర్ ఎత్తువరకు నిప్పుల నిచ్చెన ఆకారంలో టపాసులు పేలటం చూసి ఆశ్చర్యపోతున్నారు.

అంత ఎత్తు వరకు నిచ్చెన ఆకారం ఎలా ఏర్పడింది. అనే విషయం తెలియక నోరెళ్ళబెట్టారు. స్టేయిర్ వే టు హెవేన్ పేరిట పోస్ట్ చేసినటువంటి. ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఇది దాదాపుగా పదేళ్ల కిందట జరిగిన వీడియో అని దీని వెనక ఒక చిన్న ట్రిక్ ఉంది అని వైస్ అనే వెబ్ సైట్ తెలిపింది.

157 -3

ఈ మెట్ల ఆకారంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రాగి తీగల చుట్టు గన్ పౌడర్ ను నింపి మంట అంటించడంతో ఇలా అద్భుత దృశ్యం కనిపించింది అని తెలిపారు. అయితే తాను కళాకారుడుగా మారాలి అని కలలు కన్నా తన నానమ్మకు నివాళిగా కాయ్ గో క్వింగ్ అనే కళాకారుడు ఇలా నింగిలోకి టపాసులు కాల్చినట్లుగా తెలిపాడు.

అయితే ఇది 1, 650 అడుగులు లేక 502 మీటర్ల ఎత్తు వరకు ఈ నిచ్చిన అనేది మంట వ్యాపించింది అని తెలిపింది.. 1994లోనే మొదటిసారిగా అతను ఈ తరహా ప్రయత్నించినప్పుడు కూడా భారీ గాలుల వల్ల అది విజయవంతం కాలేదు అని తెలిపాడు. అలాగే 2001లో మరొకసారి ప్రయత్నం చేయాలి అని అనుకున్న అమెరికాలో జరిగిన ఉగ్రవాది దాడుల కారణంగా చైనా ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వలేదు అని తెలిపాడు.

ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశ్చర్యపోయిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ అతని జీవితం పై ఏకంగా డాక్యుమెంటరీని సైతం రూపొందించింది. కాయ్ గో క్వింగ్ ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క్ లో నివసిస్తున్నాడు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?