Elon Musk: ఎలాన్ మస్క్ ఔదార్యం ఎంత గొప్పదో తెలుసా..? భారత సంతతి వైద్యురాలికి భారీ సాయం..
భారత సంతతికి చెందిన కుల్విందర్ కౌర్ గిల్ కెనడాలోని గ్రేటర్ టోరంటోలో గత పదేళ్లుగా చిన్నపిల్లల వైద్యు రాలిగా కొనసాగుతున్నారు. పిడియాట్రిక్స్, అలర్జీ, ఇమ్యునాజీలో పోస్టుగ్రాడ్యుయేట్ ట్రైనింగ్ పూర్తి చేసి స్పెషలిస్టు డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆమె పేద ప్రజలకు, వలసదారులకు తన వైద్య సేవలు ప్రత్యేకంగా గుర్తింపు పొందారు.
ఈ పోస్టు చేయడాన్ని కెనడా మీడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆఖరికి ఆమెపై కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, సర్జన్స్ ఆఫ్ అంటారియో విచారణ సైతం కొనసాగించింది. క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించినట్లు అక్కడి ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుల్విందర్ కౌర్ గిల్ న్యాయ పోరాటానికి దిగారు.

కానీ ఆమెను దురదృష్టం వెంటాడినట్లయింది. 2022 అక్టోబర్ లో ఆమెను కోర్డు 1.2 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదే శించింది. అనేక విజ్ఞప్తుల తర్వాత జరిమానాను గత నెలలో 3 లక్షల డాలర్లుగా ఖరారు చేస్తూ తీర్పు నిచ్చింది. జరిమానా చెల్లించడానికి కూడా గడువును ఎక్కువగా లేదు.
దీంతో ఆమె అంత మొత్తంలో సొమ్మును ఇవ్వలేకపోవడంతో కుల్విందర్ కౌర్ విరా ళాలు సేకరించడం ప్రారంభించింది. అయితే మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో దాదాపు సగం నిధులు జమ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎలాన్ మస్క్ తన ఉదారతను చాటుకున్నారు.
3 లక్షల డాలర్ల మొత్తం జరిమానా తానే చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు డాక్టర్ కుల్విం దర్ కౌర్ గిల్ 'ఎక్స్సలో ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు.