Drone Attack on Russia : రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్స్ అటాక్.. తొలిసారి భారీస్థాయిలో దాడికి దిగిన ఉక్రెయిన్
రష్యాపై 50 డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. రష్యా, ఉక్రెయిన్ వార్ లో ఇదే అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్స్ గా చెప్పుకోవచ్చు. రష్యా బోర్డర్ రీజియన్ లోని రోస్తవ్ లో 50 కి పైగా డ్రోన్స్ తో అటాక్ చేసింది. ఈ దాడిని మాస్కో రక్షణ దళం అధికారులు ధృవీకరించారు. ఉక్రెయిన్ కు చెందిన క్యివి దళాలు ముందుకు దూసుకెళ్లి రష్యా గడ్డపై అడుగుపెట్టి దాడికి పూనుకున్నాయి.

ఇప్పటి వరకు తాము 44 డ్రోన్స్ ను అడ్డగించి వాటిని నాశనం చేశామని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ పేర్కొంది. రష్యాలోని మొరోజోవ్‌స్కై జిల్లాలో ఈ డ్రోన్స్ ను రష్యా రక్షణ దళం గుర్తించింది. ఇది ఉక్రెయిన్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉక్రెయిన్ డ్రోన్స్ దాడిలో ఒక పవర్ సబ్ స్టేషన్ ధ్వంసం అయిందని డిఫెన్స్ అధికారులు వెల్లడించారు.
అసలు.. ఉక్రెయిన్ టార్గెట్ ఏంటో తమకు అర్థం కాలేదని.. దగ్గర్లోనే మిలిటరీ ఎయిర్ ఫీల్డ్ ఉందని.. ఒకవేళ ఉక్రెయిన్ లక్ష్యం అదే అయి ఉండొచ్చని రష్యా మీడియా రిపోర్ట్ చేసింది. అలాగే.. రష్యా బోర్డర్ రీజియన్ లోని కుర్‌స్క్, బెల్‌గొరాడ్, క్రాస్‌నోడర్, సరతోవ్ రీజియన్ లో మరో 9 డ్రోన్స్ ను అడ్డుకున్నామని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ పేర్కొంది.
డ్రోన్స్ దాడిపై ఉక్రెయిన్ అధికారులు స్పందించలేదు. కానీ.. తమ ప్రాంతంలోకి వచ్చిన 13 రష్యా డ్రోన్స్ ను తాము కూల్చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇక.. ఉక్రెయిన్ చేసిన ఈ డ్రోన్స్ దాడిలో రష్యాకు చెందిన ఆరు విమానాలు కూడా ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. ఎనిమిది మంది రష్యా సైనికులకు కూడా గాయాలయ్యాయి.
రష్యా నేలపై ఉక్రెయిన్ దళాలు తమ దాడిని పెంచుతున్నాయి. ఉక్రెయిన్ రోజురోజుకూ రష్యాకు చుక్కలు చూపిస్తోంది. ఉక్రెయిన్ ను తక్కువ చేసి చూసిన రష్యాపై ఉక్రెయిన్ భారీగానే దాడికి ప్లాన్ చేస్తోంది. ఒకేసారి 50 వరకు డ్రోన్స్ ను రష్యాపై ప్రయోగించడం అనేది మాములు విషయం కాదు. అది ఉక్రెయిన్ సత్తా అని కూడా చెప్పుకోవచ్చు
రష్యా కూడా ఇవాళ ఉక్రెయిన్ పై దాడికి దిగినా కేవలం 13 డ్రోన్స్ ను మాత్రమే ప్రయోగించింది. కానీ.. ఉక్రెయిన్ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఒకేసారి 50 కి పైగా డ్రోన్స్ ను రష్యాపై ప్రయోగించి తన సత్తాను ప్రపంచానికి తెలియజేసింది. ఇక నుంచి ఉక్రెయిన్ పై దాడి చేయడానికి రష్యా రెండు అడుగులు వెనక్కి వేయాల్సిందే. ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.