Dubai Rains : దుబాయ్‌ని ముంచెత్తిన భారీ వర్షాలు.. విమాన సర్వీసులన్నీ రద్దు.. చెరువులా మారిన దుబాయ్ ఎయిర్‌పోర్ట్

 Dubai Rains : దుబాయ్‌ని ముంచెత్తిన భారీ వర్షాలు.. విమాన సర్వీసులన్నీ రద్దు.. చెరువులా మారిన దుబాయ్ ఎయిర్‌పోర్ట్

Dubai Rains : ప్రస్తుతం దుబాయ్‌ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అకాల వర్షాలతో దుబాయ్ అతలాకుతలం అవుతోంది. మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. అయితే.. దుబాయ్ లో ఒక సంవత్సరం, సంవత్సరంనరలో ఎంత వర్షం కురుస్తుందో అది ఒక్క రోజులోనే కురవడంతో.. దుబాయ్‌ మొత్తం జలమయమయింది. 

భారీ వర్షాల వల్ల 24 గంటలు రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్ పోర్ట్ చెరువులా మారిపోయింది. రన్ వేపై భారీగా వరద నీరు చేరడంతో దుబాయ్ నుంచి వెళ్లే, దుబాయ్ కి వచ్చే విమానాలన్నీ రద్దు చేశారు. విమాన సర్వీసులన్నీ రద్దు కావడంతో చాలామంది ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోయారు. ఒక్క రోజులోనే దుబాయ్ లో 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

178 -2

భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీయడంతో దుబాయ్ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలకు, భారీ వరదలకు రోడ్ల మీద ఉన్న వాహనాలన్నీ కొట్టుకుపోయాయి. 

Dubai Rains : 500 విమానాల దారి మళ్లింపు 

భారీ వర్షాల వల్ల దుబాయ్ ఎయిర్ పోర్ట్ చెరువులా మారడంతో 500 విమానాలను దారి మళ్లించారు. భారత్ దుబాయ్ మధ్య విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్ నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి భారత్ కు రావాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. 

దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో రన్ వే మొత్తం వరదలతో నిండిపోయింది. దాని వల్ల పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం భారీగా వర్షం కురిసింది. బుధవారం మొత్తం ఎక్కడ చూసినా దుబాయ్ లో వరద నీరు చేరింది. బుధవారం కూడా వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి. దీంతో ఆఫీసులు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. 

178 -3

ఎయిర్ పోర్ట్ తో పాటు మెట్రో స్టేషన్లు, దుబాయ్ మాల్, ఎమిరేట్స్ మాల్ అన్నీ వరద నీటితో నిండిపోయాయి. మెట్రో రైళ్లు మాత్రం కొన్ని రూట్లలో మాత్రమే నడుస్తున్నాయి. దుబాయ్ భారీ వర్షాల వల్ల యూఏఈ మొత్తం ఇబ్బందులు పడుతోంది. దానితో పాటు దుబాయ్ పక్కనే ఉన్న బహ్రెయిన్ దేశం కూడా ప్రభావానికి గురైంది. 

ఇప్పటికే ఒమన్ దేశంలో భారీగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వడగండ్ల వాన కురిసిన విషయం తెలిసిందే. ఒమన్ తర్వాత ఇప్పుడు దుబాయ్ అతలాకుతలం అయింది. దుబాయ్ భారీ వర్షాల వల్ల 18 మంది మృత్యువాత పడ్డారు. 

178 -4

1949 లో దుబాయ్ లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. అప్పటి నుంచి మళ్లీ ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో వర్షాలు పడలేదు. మళ్లీ ఇప్పుడు ఒక్క రోజులోనే దుబాయ్ లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. 1971 లో యూఏఈ ఏర్పడకముందు 1949 లో భారీగా వర్షాలు కురిశాయి. 

నిజానికి.. యూఏఈలో భారీ వర్షాలు పడతాయని, వరదలు ముంచెత్తుతాయని ముందే ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. గత సంవత్సరమే ఒమన్, యూఏఈ.. ఈ రెండు దేశాలు గత సంవత్సరమే కాప్ 28 యూఎన్ క్లైమేట్ టాక్స్ లో గ్లోబల్ వార్మింగ్ పై హెచ్చరికలు జారీ చేసింది. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?