Education banned: అక్కడ పెద్ద అమ్మాయిలా కనిపిస్తే చదువు నిషేధం..
టీనేజి బాలికలు లేకుండానే మూడో సంవత్సరం విద్య కొద్ది రోజుల క్రితం మొదలుపెట్టారు. దానిపై తాలిబాన్ విద్య మంత్రిత్వ శాఖ వివరణ కోరింది. అయిన కూడా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నిషేధాన్ని ఎత్తివేయటం వల్ల కొన్ని సమస్యలు, లోపాలు ఉన్నట్లు తాలిబాన్లు ముఖ్య అధికార ప్రతినిధి స్థానిక టీవీలో తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఈ నిషేధం దాదాపుగా 14 లక్షల మంది బాలికల చదువుల పై ప్రభావితం చేసినట్లుగా యూనిసెఫ్ పేర్కొన్నారు.
తమన్నాకి పీహెచ్ డి చేయడం తన కల. మేము శారీరకంగా బతికి ఉన్నాం కానీ మానసికంగా ఎప్పుడో చచ్చిపోయాం అని తమన్నా తెలిపారు. బాలికలు స్కూలుకు వెళ్లకుండా తాలిబాన్లు 2021 సెప్టెంబర్ లో మొదటగా అడ్డుకున్నారు. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ని నియంత్రణలోకి తీసుకున్న నెల రోజులకి ఇది జరిగింది.
ఈ సంవత్సరం మార్చిలో 3,30,000 మంది బాలికలు సెకండరీ స్కూల్ విద్యను మొదలు పెట్టాల్సి ఉంది అని యుని సేఫ్ అంచనా వేసింది. తరగతిలో మొదటి ర్యాంక్ వచ్చిన జైనాబ్ మాట్లాడుతూ నా కలలన్నీ సమాధి అయినట్లుగా ఉంది అని తెలిపారు.లజైనాబ్ తండ్రి ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి వెళ్ళటానికి ప్రయత్నించారు.
కానీ ఫలితం దక్కలేదు. జైనాబ్ కు చదువుకోటానికి ముందు ఉన్న ఏకైక దారి ప్రభుత్వ నియంత్రత మత స్కూల్ మదర్స్ లలో చదువుకోవటం. కానీ తమ కుటుంబానికి ఏ మాత్రం ఇష్టం లేదు. పాఠశాలకు ఇది ఏ మాత్రం ప్రత్యమ్యాయం కాదు అని జైనాబ్ తండ్రి అన్నారు. అక్కడ వారికి కేవలం మతపరమైన సబ్జెక్టులు మాత్రమే చెపుతారు అని తెలిపారు..
ఆన్ లైన్ కోర్సులు బిబిసి డార్స్ వంటి ఎన్నో కార్యక్రమాలు చూడటం వల్ల బాలికలు తమ చదువులు కొనసాగిస్తున్నారు. బిబిసి డార్స్ అనగా అప్గన్ పిల్లల కోసం మొదలు పెట్టిన విద్య కార్యక్రమం స్కూల్ నుంచి నిషేధించిన 11,16 ఏళ్ల వయసు బాలికల కు ఉపయోగంగా ఉండే ఈ విద్యా కార్యక్రమాన్ని యూనిసెఫ్ లెర్నింగ్ లైఫ్ లైన్ అని అభినందించింది. చాలామంది అప్గ్ న్ బాలికల భవిష్యత్ అంధకారంలో పడింది అని ఆమె హెచ్చరించారు.
యుక్త వయసు వచ్చిన బాలికలకు చిన్నతనంలోనే వివాహం చేస్తున్నట్లుగా ఆమె నొక్కి చెప్పారు. బాధాకర వివాహ బంధాల నుండి మహిళలను రక్షించడానికి ఉన్న చట్టాలను తాలిబాన్లు ఉపసంహరించటంతో వారి కష్టాలు మరింతగా పెరిగాయి అని తెలిపారు. టీనేజీ బాలికలు అనగా 13 ఏళ్లు వచ్చిన వారు కాకుండా అంతకంటే చిన్న వయసులో ఉన్న బాలికలను కూడా పాఠశాలకు వెళ్లకుండా నిషేధించినట్లుగా తెలిపింది.
నయ వయసు 11 సంవత్సరాలు ఆమె పాఠశాలకు వెళ్ళటానికి వీలు లేదు.ఆమె అసలు వయసు కంటే పెద్దమ్మాయిలాగా కనిపిస్తుందని ఆమె పాఠశాలలో రానివ్వట్లేదు అని ఆమె తండ్రి తెలిపారు. నయా చూడటానికి 11 సంవత్సరాల కంటే పెద్ద అమ్మాయిలాగా కనిపిస్తుంది అని పాఠశాలకు పంపకూడదు అని చెప్పారు. ఆమె హిజాబ్ ధరించి ఇంట్లోనే ఉండాలి అని నయా తండ్రి తెలిపారు.
ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం నియమాల్లో మార్పులు వస్తాయని ఆయన అనుకోవటం లేదు. తాలిబాన్ లో విధించిన నిషేధాలకు అప్గన్ ప్రజల మద్దతు ఉందని చెప్పటం చాలా పెద్ద అబద్ధం అని ఆయన స్పష్టంగా తెలియజేశారు. అప్గన్ తమ కూతుర్ల చదువులు కోరుకోవటం లేదు అనేది కూడా పెద్ద ఆరోపణ. ముఖ్యంగా కాందహార్ తో పాటు ఇతర పాస్తూన్ ప్రావిన్స్ లో చాలామంది తమ పిల్లలను పాఠశాలలకు, యూనివర్సిటీలకు పంపటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు..
మహిళలు ఎప్పుడు యూనివర్సిటీలకు వెళ్లకుండా 2022 డిసెంబర్ లో ఆదేశాలు జారీ చేశారు. అలాగే మగతోడు లేకుండా మహిళలు ఎంత దూరం వరకు ప్రయాణం చేయవచ్చు, వాళ్లు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి ఉద్యోగాలు చేయాలి అనే అంశాలు విధించటంతో పాటు పార్కులకు కూడా వెళ్లకుండా నిషేధించారు. రహస్య స్కూల్ ఆన్ లైన్ విద్యను అందించటానికి ఆమ్నేస్టికి చెందిన సమీరా ఆశాభావం వ్యక్తం చేశారు.
కానీ 10 లక్షల మంది పైగా బాలికలు ప్రాథమిక హక్కు అయినప్పటికీ విద్యపై నిషేధం ఎదుర్కొంటున్న ఒక దేశంలోనే ఇలాంటి ప్రయత్నాలు ఏమాత్రం సరిపోవు అని ఆమె తెలిపారు. తాలిబాన్లపై చర్యలు తీసుకునేలా అంతర్జాతీయ సమాజం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ఇది జరిగేదాకా హబీబా,మస్తాబ్,తమన్నా ఇలాంటి బాలికలు చదువు మానేసి ఇంట్లోనే కూర్చోక తప్పదు.18 ఏళ్ల హబీబా మేము జైల్లో ఉన్నట్టుగా ఉంది అని తెలిపారు.
కానీ పరిస్థితులలో ఎప్పటికైనా మార్పులు వస్తాయని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తమన్నా మాత్రం వాళ్ల కోసం పాఠశాల తెరుచుకోవడం అనేది అనుమానమే అని తెలిపింది. నిజంగా స్కూల్ లు తెరుచుకుంటాయో లేదో తెలియటం లేదు. ఎందుకంటే బాలికల గురించి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించటం లేదు. ఎప్పటికీ బాలికలను అర్థం చేసుకోరు. అసలు వారు బాలికలకు విలువే ఇవ్వరు అని 16 ఏళ్ల తమన్నా నిరాశ వ్యక్తం చేసింది..