Helicopter Crash : కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. 10 మంది స్పాట్ డెడ్

Helicopter Crash : కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. 10 మంది స్పాట్ డెడ్

Helicopter Crash : ఓ మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 10 మంది అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కెన్యాలో చోటు చేసుకుంది.  ఈ ప్ర‌మాదంలో కెన్యా డిఫెన్స్ చీఫ్ తో పాటు మరో తొమ్మిది మంది మిలిటరీ ఉన్నతాధికారులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. కెన్యా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 2.20 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. 

కెన్యా డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమండి ఒగొల్లా మృతి చెందడంపై కెన్యా ప్రెసిడెంట్ విలియమ్ రుటో సంతాపం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలియగానే.. కెన్యా ప్రెసిడెంట్ విలియం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తో ఎమర్జెన్సీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. 

ఫైటర్ పైలట్ గా మిలిటరీలోకి వచ్చిన ఒగొల్లా.. గత సంవత్సరమే డిఫెన్స్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 40 ఏళ్ల పాటు మిలిటరీ సర్వీసులో ఉన్నారు. 

190 -2

Helicopter Crash : హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ ఇద్దరు అధికారులు

ఈ ఘటనలో మరో ఇద్దరు అధికారులు ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన కెన్యా రాజధాని నైరోబీకి 400 కిమీల దూరంలో ఉన్న ఎల్గెయో మరక్ వెట్ దేశంలో చోటు చేసుకుంది. హెలికాప్టర్ క్రాష్ కు కారణాలను వెంటనే అణ్వేషించాలని.. దర్యాప్తు టీమ్ ను కెన్యా ఎయిర్ ఫోర్స్ ఆదేశించింది. 

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు గుర్తించారు. డిఫెన్స్ చీఫ్ మరణంతో శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు దేశమంతా సెలవులు ప్రకటించారు. కెన్యా జెండాను కూడా సగం వరకే ఎగురవేయాలని ఆదేశించారు. దేశమంతా సంతాప సభలు నిర్వహించాలని దేశ అధ్యక్షుడు రుటో వెల్లడించారు. 

గత 12 నెలల్లో ఇప్పటి వరకు ఐదు మిలిటరీ హెలికాప్టర్లు క్రాష్ అయ్యాయి. దానికి కారణం.. హెలికాప్టర్ల నిర్వహణ సరిగ్గా లేదని.. అవన్నీ పాతవని, వాటిని ఎలాంటి మెయిన్ టెనెన్స్ లేకుండా వాడటం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కెన్యా మీడియా రిపోర్ట్ చేసింది. 

190 -3

జూన్ 2021 లో కూడా నైరోబీలో హెలికాప్టర్ కూలిన ఘటనలో 10 మంది సైనికులు మృత్యువాత పడ్డారు. ఒగొల్లా ప్రయాణించిన హెలికాప్టర్ పేరు హువె. నార్త్ రిఫ్ట్ ఏరియాలో ఉన్న ట్రూప్స్ ను విజిట్ చేయడం కోసం హెలికాప్టర్ లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆపరేషన్ మలిజా ఉహలిఫులో భాగంగా నార్త్ రిఫ్ట్ ప్రాంతంలో ట్రూప్స్ ను ఏర్పాటు చేశారు. 

హువే హెలికాప్టర్ అసలు వేరు యూహెచ్ 1బీ హెలికాప్టర్. దీన్ని 1950 లో తయారు చేశారు. ఈ హెలికాప్టర్ ను వియత్నాం వార్ సమయంలో యూఎస్ మిలిటరీ వాడుకుంది. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?