Indian Women died in US : యూఎస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారత మహిళలు మృతి 

 Indian Women died in US : యూఎస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారత మహిళలు మృతి 

Indian Women died in US : యూఎస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత్ కు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన దక్షిణ కరోలినాలోని గ్రీన్ విల్లే కౌంటీలో చోటు చేసుకుంది. వాళ్లంతా గుజరాత్ లోని ఆనంద్ జిల్లాకు చెందిన మహిళలు. 

మితిమీరిన వేగంతో ప్రయాణించిన ఆ ఎస్‌యూవీ కారు.. గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

హైవేపై వెళ్తున్న ఆ ఎస్‌యూవీ కారు.. అన్ని లేన్లను దాటుకుంటూ వేగంగా వెళ్తూ సడెన్ గా గాల్లోకి లేచింది. 20 ఫీట్ల పైకి లేచి అనంతరం పక్కనే ఉన్న చెట్లను ఢీకొట్టి బ్రిడ్జికి అవతలి వైపు పడిపోయిందని గ్రీన్ విల్లే కౌంటీ కొరొనర్ ఆఫీసర్ వెల్లడించారు.  

Indian Women died in US : స్పీడ్ లిమిట్ కు మించి వెళ్లడం వల్లే ఈ ప్రమాదం

స్పీడ్ లిమిట్ కు మించి వేగంగా వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చీఫ్ డిప్యూటీ కొరొనర్ మైక్ ఎల్లిస్ అన్నారు. ఈ ప్రమాదంలో వేరే ఏ ఇతర వాహనాలు ఇన్వాల్వ్ కాలేదని.. కేవలం మితిమీరిన వేగం వల్లనే ఆ ఎస్‌యూవీ అదుపు తప్పిందని తెలిపారు.

277 -2

వెంటనే అక్కడికి చేరుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, సౌత్ కరొలినా హైవే పెట్రోల్, గాంట్ ఫైర్ అండ్ రెస్క్యూ, మల్టిపుల్ గ్రీన్ విల్లే కౌంటీ ఈఎంఎస్ యూనిట్స్ అందరూ అక్కడికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. 

అయితే.. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మాత్రం ప్రాణాల నుంచి బయటపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళలు రేఖాబేన్ పటేల్, సంగీతాబేన్ పటేల్, మనీషా బేన్ పటేల్ గా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారు, ఆనంద్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. 

ఇక.. కారు అత్యంత వేగంతో వెళ్లి చెట్టుకు ఢీకొనడంతో కారు ముక్కలు ముక్కలుగా అయింది. కారు కొంత భాగం చెట్టులోనే చిక్కుకుపోయింది. అయితే.. ఆ కారులో డిటెక్షన్ సిస్టమ్ ఉంది. కారు ప్రమాదానికి గురికాగానే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని రెస్క్యూ టీమ్ కు ఇన్ ఫామ్ చేసి ఆ గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగలిగారు.  

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?