Israel Airstrikes on Iran Embassy in Syria : సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. ఇరాన్ ఎంబసీపై ఎయిర్ స్ట్రైక్.. 11 మంది మృతి
ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్టు బ్రిటన్ లో పని చేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. చనిపోయిన 11 మందిలో 8 మంది ఐరాన్ కి చెందిన వాళ్లు కాగా, ఇద్దరు సిరియా వాళ్లు, ఒకరు లెబనీస్ వాళ్లుగా గుర్తించారు. అయితే.. ఇరాన్ ఎంబసీకి చెందిన కాన్సులర్ విభాగంపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ మిలిటరీ సలహాదారు జనరల్ మహమ్మద్ రెజా జహెదీ మరణించారు. అలాగే మరో అధికారి బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ హదీ హజీ రహిమి మృతి చెందారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది హైలేవల్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు.
వీళ్లను ఐఆర్జీసీ అంటారు. గాజా యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి హమాస్ విషయంలో హెజ్ బొల్లా, ఇజ్రాయిల్ మధ్య బార్డర్ వద్ద యుద్ధం కొనసాగుతూనే ఉంది. కానీ.. ఇలా ఇరాన్ ఎంబసీపై దాడి చేసేంత దారుణానికి ఇజ్రాయెల్ పూనుకుంటుందని ఊహించలేదని హెజ్ బొల్లా గ్రూప్ వెల్లడించింది.
లెబనాన్ లో హెజ్ బొల్లా గ్రూప్ విస్తరణలో జహేదీ కీలక పాత్ర పోషించారని.. ఆయన త్యాగాన్ని హెజ్ బొల్లా ఎన్నటికీ మరవదని వెల్లడించింది. ఇరాన్ కు చెందిన క్యుడ్స్ ఫోర్స్ కు జహేదీ లీడర్ గా వ్యవహరించారన్నారు పాలెస్థీనా, సిరియా, లెబనాన్ కు చెందిన క్యూడ్స్ ఫోర్స్ లకు జహేదీ లీడర్ గా వ్యవహరించారు.
ఈ దాడిపై తాము స్పందించం. ఈ దాడి విషయంలో ఇప్పుడు మేము ఎలాంటి ప్రకటనలు చేయం అని చెప్పడంతో ఈ ఘటన తమని మరింత రెచ్చగొట్టిందని.. ఇప్పటికే గాజా యుద్ధంతో చాలా ఇబ్బందులు వస్తున్నాయని.. ఇజ్రాయెల్ ప్రతిదాడికి సిద్ధం కావాల్సిందేనని ఇరాన్ అధికారులు హెచ్చరించారు.
ఇక.. ఇరాన్ మిలిటరీ సలహాదారు అయిన రెజా జెహదీ 2016 వరకు లెబనాన్, సిరియా దేశాల్లో ఉన్న ఖుద్స్ అనే బలగాలకు నేతృత్వం వహించారు. ఆయన ఇరాన్ మిలిటరీ కోసం ఎన్నో మిషన్లలో పాల్గొన్నారు. తన ప్రాణాలను సైతం ఏనాడూ లెక్కచేయలేదు.
ఇరాన్ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన రెజా జెహదీ మృతిపై ఇరాన్ చాలా కోపంగా ఉంది. జెహదీతో పాటు పలువురు ఇతర సిబ్బందిని పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకోకుండా ఉండం అని ఇరాన్ శపథం చేసింది. యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని ఇజ్రాయెల్ కు పిలుపునిచ్చింది ఇరాన్.