Maldives Thanks India : మాల్దీవులకు భారత్ మళ్లీ ఎందుకు సాయం చేసింది? ముయిజ్జు భారత్‌ను అవమానించినా ఎందుకు అండగా నిలిచింది?
మాల్దీవులు కాకపోతే మన దేశంలోనే ఉన్న లక్షద్వీప్ చాలా బెటర్ అని.. దాని కన్నా బెస్ట్ టూరిజం ప్లేసులు భారత్ లో చాలా ఉన్నాయని భారతీయులు కూడా మాల్దీవుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మా భారత్ ను కించపరుస్తారా? అని మాల్దీవులను భారతీయులు బైకాట్ చేశారు. దీంతో మాల్దీవులు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇదంతా అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది.
Maldives Thanks India : లోన్ తీర్చేందుకు మరో ఏడాది గడువు ఇచ్చిన భారత్
మరో ఏడాది పాటు ఎలాంటి వడ్డీ కట్టకుండానే ఆ రుణాన్ని వాడుకోవచ్చని.. ఏడాది తర్వాత ఎలాంటి వడ్డీ లేకుండా ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయొచ్చని భారత్.. మాల్దీవులకు సాయం చేయడంతో మాల్దీవులు ప్రభుత్వం.. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.
అయితే.. మాల్దీవులు ప్రెసిడెంట్ ముయిజ్జు ఇటీవల.. భారత్ కు చెందిన సైనిక బలగాలను.. తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని ఒత్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ బలగాలు.. మాల్దీవుల నుంచి ఉపసంహరించుకున్నారు. ఈనేపథ్యంలో కూడా భారత్.. మాల్దీవులకు తోడుగా నిలిచింది. దీంతో.. మాల్దీవులు విదేశాంగ శాఖ మంత్రి ముసా జమీర్.. భారత విదేశీ మంత్రి జైశంకర్ కు ధన్యవాదాలు తెలిపారు.
నిజానికి చైనాకు అనుకూలంగా వ్యవహరించే ముయిజ్జు మాల్దీవులకు ప్రెసిడెంట్ అయినప్పటి నుంచే భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు తెగిపోయాయి. అంతకుముందు మాల్దీవులు, భారత్ మధ్య సంబంధాలు బాగుండేవి. ఈ మధ్య క్షీణించినా కూడా భారత్.. అవేవీ పట్టించుకోకుండా.. మాల్దీవులకు సాయం చేసింది.
మే 8 నుంచి 10 వరకు భారత్ లో పర్యటించిన మాల్దీవులు విదేశీ శాఖ మంత్రి.. భారత్ చేసిన సాయాన్ని పొడిగించాలని కోరడంతో భారత్ కూడా పాజిటివ్ గా స్పందించింది. మాల్దీవుల అభ్యర్థనకు ఒప్పుకుంది.