Time 100 Most Influential People : సత్య నాదెళ్ల, అలియా భట్‌కు టైమ్ జాబితాలో చోటు.. ఇంకా ఎవరెవరు చోటు దక్కించుకున్నారంటే?
ప్రతి సంవత్సరం టైమ్ మ్యాగజైన్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ వ్యక్తుల లిస్టును విడుదల చేస్తుంటుంది. తాజాగా విడుదల చేసిన లిస్టులో అలియా భట్ పేరు, సత్య నాదెళ్ల పేరు ఉంది. అలియా భట్ పేరును సెలెక్ట్ చేయడానికి కారణాలను కూడా బ్రిటిష్ రచయిత, ఫిలిం మేకర్ టామ్ హార్పర్ వెల్లడించారు.

అలాగే.. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగాకు కూడా చోటు దక్కింది. యాక్టర్, డైరెక్టర్ దేవ్ పటేల్ కూడా 100 మంది వ్యక్తుల లిస్టులో చోటు దక్కించుకున్నాడు. ఒలింపిక్స్ విజేత సాక్షి మాలిక్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలులైన 100 మంది జాబితాలో ఈసారి భారతీయులకు చాలామందికే చోటు దక్కింది.
ఈ లిస్టులో యూఎస్ ఎనర్జీ డిపార్ట్ మెంట్ కు చెందిన లోన్ ప్రోగ్రామ్స్ ఆఫీస్ డైరెక్టర్ జిగర్ షా, యేలె యూనివర్సిటీలో ప్రొఫెసర్ ప్రియంవద నటరాజన్, భారత సంతతికి చెందిన రెస్టారేటర్ ఆస్మా ఖాన్, రష్యా ప్రతిపక్ష అలెక్సీ నవాల్నీ భార్య యులియా కూడా ఉన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న వాళ్లను వెతకడం అనేది అంత ఈజీ కాదు. వాళ్ల స్కిల్ ఏంటి.. వాళ్ల వల్ల ఈ ప్రపంచానికి ఎలాంటి మేలు కలిగింది. ప్రపంచమంతా వాళ్ల ప్రతిభ వల్ల గుర్తుపెట్టుకుందా? అనే అంశాలను చూసే 100 మందిని సెలెక్ట్ చేశారని టైమ్ మ్యాగజైన్ లో యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ తెలిపారు.

ఇలా.. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా కావచ్చు.. అలియా భట్ కావచ్చు.. సత్య నాదెళ్ల కావచ్చు.. వీళ్లంతా తమ రంగాల్లో నిష్ణాతులు. తమ రంగాల్లో రాణించారు. అలాగే.. ఆస్కార్ అవార్డు విజేత డేనియల్ కాలుయా కూడా టైమ్ లిస్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇలా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను పరిగణనలోకి తీసుకొని ఏ రంగంలో ఎవరు అత్యంత ప్రతిభ చూపించి.. వాళ్ల ప్రతిభతో ప్రపంచానికి ఎలాంటి మార్గదర్శకాలను తీసుకెళ్లారు.. అనే దానిపై టైమ్ మ్యాగజైన్ పరిశోధన చేసి వాళ్లను తమ టాప్ 100 లిస్టులో చేర్చింది.
