World’s Oldest Man : చేపలు, చిప్స్ తిని 111 ఏళ్లు బతికాడు.. గిన్నిస్ రికార్డ్‌ సృష్టించిన‌ ఆ తాత ఎవరో తెలుసా?

World’s Oldest Man : చేపలు, చిప్స్ తిని 111 ఏళ్లు బతికాడు.. గిన్నిస్ రికార్డ్‌ సృష్టించిన‌ ఆ తాత ఎవరో తెలుసా?

World’s Oldest Man : ఆ తాత పేరు జాన్ ఆల్ ఫ్రెడ్. వయసు 111. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఈయనే. ఈయన కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్లు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అంటే 111 ఏళ్లకు మించి ప్రస్తుతం బతికి ఉన్న వాళ్లు ఎవ్వరూ లేరన్నమాట. ఈ తాత ఒక్కడే ఉన్నాడు. అందుకే ఈ తాత గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేయడమే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసు ఉన్న వృద్ధుడిగా చరిత్రకెక్కాడు. 

అసలు ఈ జనరేషన్ లో 60 నుంచి 70 ఏళ్లు బతికితేనే గొప్ప అని అనుకుంటాం. కానీ.. ఈ తాత ఇన్ని సంవత్సరాలు ఎలా బతికాడు. సెంచరీ ఎలా దాటాడు. సెంచరీ పూర్తి చేసి కూడా ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నాడు అనే డౌట్ అందరికీ వస్తుంది.

కానీ.. ఆ తాత ఇంత ఆరోగ్యంగా ఉండటానికి.. ఇన్ని రోజులు బతికి ఉండటానికి కారణం కూడా చెప్పేశాడు. తన లైఫ్ సీక్రెట్స్ కూడా అందరితో పంచుకున్నాడు. చేపలు, చిప్స్, అదృష్టం.. ఇవే తను ఇప్పటికీ బతికి ఉండటానికి కారణం అంటూ చెప్పుకొచ్చాడు తాత. 

91 -2

ఈ తాత ఆగస్టు 26, 1912 లో జన్మించాడు. అంటే.. టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిన కొన్ని నెలలకే జన్మించాడు అన్నమాట. రెండు ప్రపంచ యుద్ధాలను తన కళ్లారా చూశాడు. అంతే కాదు.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటీష్ ఆర్మీలో పని చేశాడు కూడా. 

World’s Oldest Man : 114 ఏళ్ల వెనుజులా వ్యక్తి చనిపోవడంతో రికార్డ్ క్రియేట్ చేసిన జాన్ తాత 

నిజానికి 114 ఏళ్ల వెనుజులాకు చెందిన జువాన్ విసెంటె పెరెజ్ అనే వ్యక్తి అత్యంత వయసు ఉన్న వృద్ధుడుగా రికార్డ్ క్రియేట్ చేసినా.. ఆ తాత ఈ నెలలోనే చనిపోయాడు. ఆ తర్వాత 112 ఏళ్ల జపాన్ కు చెందిన గిసబురో అనే వ్యక్తి కూడా మార్చి 31న చనిపోవడంతో 111 ఏళ్ల యూకేకు చెందిన జాన్ తాతకు అవకాశం దక్కింది.

ఇప్పుడు 111 ఏళ్ల జాన్ ఆల్ ఫ్రెడ్ మాత్రమే అత్యంత వయసు ఉన్న వృద్ధుడిగా చరిత్ర సృష్టించాడు. నార్త్ వెస్ట్ ఇంగ్లండ్ లోని సౌత్ పోర్ట్ లో ఉండే ఈ తాత ఇంటికి వెళ్లి గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు.. సర్టిఫికెట్ అందజేశారు. ఈ తాత అకౌంటెంట్ గా కొన్నేళ్లు పని చేసి.. రిటైర్ అయ్యాడు. తన జీవితంలో ఎప్పుడూ ఈ తాత పొగ తాగలేదట. అప్పుడప్పుడు మాత్రమే మద్యం తాగేవాడట.

91 -3

ప్రత్యేకంగా ఒక డైట్ అంటూ ఏదీ ఫాలో కాలేదట ఈ తాత. కాకపోతే.. ప్రతి వారం అంటే వారంలో ఒక రోజు మాత్రం చేపలు, చిప్స్ మాత్రం తినేవాడట. మీరు బాగా మద్యం తాగినా.. ఎక్కువ తిన్నా.. ఎక్కువ నడిచినా.. ఇలా ఏది ఎక్కువ చేసినా కూడా మీరు జీవితంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. అంటూ జాన్ తాత చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్లు బతకడం అంటే.. అది నా అదృష్టం అనే చెప్పుకోవాలి..

మీరు ఎక్కువ సంవత్సరాలు బతికినా.. తక్కువ సంవత్సరాలు బతికినా.. అది మీ చేతుల్లో ఉండదు.. అంటూ వేదాంతం చెప్పుకొచ్చాడు తాత. ఇక.. ప్రపంచంలోనే అత్యంత వయసు ఉన్న మహిళగా స్పెయిన్ కు చెందిన 117 ఏళ్ల మారియా బ్రన్యాస్ రికార్డ్ క్రియేట్ చేసింది. మన జాన్ తాత మాత్రం అత్యంత వయసు ఉన్న పురుషుడిగా చరిత్ర సృష్టించాడు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?