Test cricket: టీమిండియా స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్.... ఆటగాళ్ల వేటు పై బీసీసీఐ సంచలన నిర్ణయం ?
టీమిండియా ఘోర పరాజయం తర్వాత బిసిసిఐ అణాధికారికి సమావేశాన్ని నిర్వహించింది. మైదానంలోనే టీమ్ ఇండియా కోచ్ అయినటువంటి గౌతమ్ గంభీర్ తో చీఫ్ సెలెక్టర్ అజిత్ సుదీర్ఘంగా చర్చించారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మతో సహా నలుగురు సీనియర్లపై వేటుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలిసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా మరియు రవిచంద్రన్ అశ్విన్లలో కనీసం ఇద్దరిని జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుందని సమాచారం అందింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు టీమ్ ఇండియా అర్హత సాధించకపోతే ఈ స్టార్ ఆటగాళ్లపై ఖచ్చితంగా వేటు వేయాలని బోర్డు నిర్ణయించుకుందని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. డబ్ల్యూటీసి ఫైనల్స్ అనంతరం జరిగే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు సీనియర్లు లేకుండా జట్లు పంపించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టు ఇప్పటికే ఎంపిక చేయడంతో తర్వాత ఇంగ్లాండ్తో జరుగునున్న టెస్ట్ సిరీస్ లో మార్పులు చేపట్టనున్నట్లు చెప్పారు.
రోహిత్ గత పది ఇన్నింగ్స్ లో ఆరుసార్లు సింగల్ డిజిట్ కే పరిమితమవడంతో అందరూ కూడా మండిపడుతున్న విషయం తెలిసిందే. రెండుసార్లు 20 కంటే తక్కువ స్కోరుకే వెను తిరిగాడు. మరో వైపు స్వదేశంలో కోహ్లీ గత 25 ఇన్నింగ్స్ లో కేవలం 742 పరుగులు మాత్రమే చేశాడు. ఇక భారత్ డబ్ల్యుటిసి ఫైనల్స్ కు క్వాలిఫై కావాలంటే ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టులు సిరీస్ ను 4-0 కచ్చితంగా గెలవాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలు పై ఆధారపడకుండా టైటిల్ పోరుకు చేరుతుంది. నవంబర్ 22 నుంచి 5 టెస్టులు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైతున్న విషయం మనందరికీ తెలిసిందే.