Beautiful Sunsets: సూర్యరశ్మి మన శరీరానికి ఏయే సమయాల్లో తాకితే ఎంతెంత బెనిఫిట్ ఉంటుందంటే..
ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా ఎండలో నిలబడితే డి విటమిన్ అనేది మన శరీరంలో ఏర్పడుతుంది. తద్వారా శరీరం అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ ఎండ ద్వారా వచ్చేటువంటి డి విటమిన్ అనేది పెరిగితే శరీరం కాల్షియం, ఫాస్ఫరస్లను ఆహారం మంచిగా పీల్చుకుంటుంది. ఈ కాల్షియం ద్వారా ఎముకలు చాలా గట్టి పడతాయి. అంతేకాకుండా ఒంట్లో రక్తం అనేది ఎక్కువగా తయారవుతుంది. కాల్షియం శరీర జీవక్రియలను నియంత్రించే హార్మోన్ల తయారీకి ఉపయోగపడుతుంది.
అయితే ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది మధ్యాహ్నం సమయంలో వచ్చేటటువంటి ఎండలో ఎక్కువగా ఉంటున్నారు. తద్వారా కిడ్నీలకు మరియు చర్మానికి నష్టమే తప్ప అసలు లాభం ఉండదు. అంతేకాకుండా పొద్దున మీకు కనుక సమయం కుదరకపోతే సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఆ కాసేపు ఎండలో నిల్చున్నా కూడా ఫలితాలు ఉంటాయి. అంతేకానీ మధ్యాహ్నం పూట ఎండలో మాత్రం ఎవరు కూడా ఎక్కువసేపు ఉండకండి.

ప్రస్తుతం చాలామంది ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ను విపరీతంగా తింటున్నారు. మీరు ఎంత తిన్నా కూడా డి విటమిన్ సరిపోయేంత లేకుంటే కచ్చితంగా మన బాడీలోని ఎముకలు వీక్ అయిపోతాయి. కచ్చితంగా చిన్న పిల్లలనుండి ముసలి వారి వరకు ఉదయం పూట ఎండలో కాసేపు నడిస్తేనే ప్రయోజనాలనేవి ఉంటాయి.
మీకు కనుక డి విటమిన్ లోపిస్తే ఇక తర్వాత కాల్షియం లోపం అనేది వస్తుంది. కాల్షియం లోపం మూలంగా ఎముకలు చాలా వీక్ గా మారుతాయి. తద్వారా ఎముకలు వ్యాధి (స్టీయో పోరోసిస్ ) అనేది వస్తుంది. కాల్షియంలు రక్తంలో కావాల్సినంత ఉంటే రక్తం గడ్డకట్టే స్వభావం నుండి మంచిగా ఉంటాయి.