Kanguva: కంగువా కలెక్షన్లు తుస్!... మొదటిరోజు ఎంత వచ్చాయో తెలుసా ?
అయితే మొదటి రోజు సూర్య మూవీ కేవలం 50 కోట్ల వరకు కలెక్షన్లు దక్కించుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. అయితే ప్రీమియర్ షో నుంచి కంగువ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ పై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. దీంతో అంచనా వేసిన నీ కలెక్షన్లు రాకపోవడంతో మూవీ యూనిట్ నిరాశ పడింది. ఇక తొలి రోజు కంగువ మూవీ వరల్డ్ వైడ్ గా కేవలం 22 కోట్లు మాత్రమే కలెక్షన్లను రాబట్టింది. అత్యధికంగా తమిళంలో 13 కోట్ల వరకు వసూళ్లు సొంతం చేసుకున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఇక టాలీవుడ్ పరంగా 6 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇక హిందీలో మూడు కోట్ల 25 లక్షలు వచ్చినట్లు తెలిపారు.

ఇక కేరళ మరియు కర్ణాటకలో కంగు ప్రభావం ఏ మాత్రం కనిపించలేదట. ఈ రెండు స్టేట్స్లలో సూర్య సినిమాను గట్టిగానే ప్రమోట్ చేసిన కానీ తొలిరోజు కేరళలో మూడు లక్షలు మరియు కర్ణాటకలో తొమ్మిది లక్షలు మాత్రమే కలెక్షన్లను దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా కంగువ మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ అనేది 400 కోట్ల వరకు జరిగినట్లుగా మనకు సమాచారం అందింది. ఇక తొలిరోజు వసూలు పరంగా చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.