Earn Money: డబ్బును ఆదా చేసే విషయంలో ఈ పొరపాట్లు అసలు చేయవద్దు?
సంపన్నులకైతే ఇది ఒక చిన్న మాట కావచ్చు. అదే మధ్య తరగతి కుటుంబాలకు ఇది చాలా పెద్ద విషయం ఉంది. డబ్బులు సంపాదించాలని అనుకున్నా వారు ఖచ్చితంగా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే ఈ డబ్బు సంపాదించే వాళ్ళు కచ్చితంగా కొన్నిటిని ఫాలో అవ్వాలి. అప్పుడే మనం చాలా జాగ్రత్తగా డబ్బులను సేవింగ్స్ చేసుకోవచ్చు.
జీవితంలో ఆర్థికంగా ఎదగాలంటే కచ్చితంగా ముందుగా మనం చేయాల్సిన విషయం ఏమిటంటే సంపాదనతో పాటు ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చుల విషయంలో ఏమాత్రం తప్పు చేసిన మొత్తం డబ్బు అంత పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఒక రూపాయి కూడా మిగలకుండా పోతుంది. కాబట్టి ఎక్కువగా డబ్బు విషయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉండడం వల్ల మనం ఆర్థికంగా ఎదగవచ్చు.
అలాగే మరి కొంతమంది క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులను ఉపయోగించుకున్న తర్వాత కట్టుకోవచ్చు అనే దీమాతో ఉంటారు. ఇలాంటి వారికి డబ్బు విలువ అనేది అసలు ఉండదు. అంతేకాకుండా వీళ్ళు భవిష్యత్తులో కచ్చితంగా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా డబ్బులు అన్ని ఖర్చు అయిపోయాక అనే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ రోజుల్లో ఆడవాళ్లు షాపింగ్ అంటూ ఇష్టానుసారంగా డబ్బులను వృధా చేస్తున్నారు. ఇలాంటి అలవాట్లు అనేవి కచ్చితంగా ఆడవాళ్లు మానుకోవాలి. డబ్బులు సరిగ్గా ఖర్చు చేసుకోకపోతే మనం పైన చెప్పినట్లుగా కచ్చితంగా ఏదో ఒక సమయంలో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటాం.