Karthika Masam 2025: కార్తీక మాసంలో టూర్‌కి చేస్తున్నారా?.... అయితే ఈ పర్యాటక ప్రాంతాన్ని ఒకసారి వీక్షించండి!

Karthika Masam 2025: కార్తీక మాసంలో టూర్‌కి చేస్తున్నారా?.... అయితే ఈ పర్యాటక ప్రాంతాన్ని ఒకసారి వీక్షించండి!

Karthika Masam 2025:  ప్రతి ఒక్కరు కూడా  ఏదో ఒక సీజన్లో  ఖాళీగా ఉన్న సందర్భాల్లో టూర్ కి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. కొందరు దేశంలోనే పలు ముఖ్యమైనటువంటివి లేదా మరికొన్ని ఫేమస్ అయినటువంటి టెంపుల్స్ కు లేదా టూరిస్ట్ ప్లేసులకు లేదా పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే ఈ శీతాకాలం అందులో కార్తీకమాసంలో  ఏదైనా పర్యటనకు వెళ్లాలి అని అనుకుంటే  నేను చెప్పబోయే    ప్రాంతానికి అయితే ఒకసారి వెళ్లి రండి. అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా సాగర్ టు శ్రీశైలం లాంచీ అనేది స్టార్ట్ అయింది. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఖచ్చితంగా ఈ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు బోటు ప్రయాణాన్ని ఎంతగానో ఆస్వాదిస్తారంటే అందులో అతిశయోక్తం లేదు. ఈ మధ్యనే కార్తీకమాసం తొలి రోజున తెలంగాణ పర్యాటక శాఖ ఈ శ్రీశైలం టు నాగార్జునసాగర్ బోటు ప్రయాణాన్ని అయితే ప్రారంభించింది. ఇప్పటికే వేలాది మంది భక్తులు కూడా ఈ బోటు ప్రయాణాన్ని అలాగే కొండ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాన్ని వీక్షించడానికి  బయలుదేరి మరి వస్తున్నారు. 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

 

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

గత ఐదేళ్లుగా ప్రణాళికలు వేసినప్పటికీ... సాగర్ లో సరైన స్థాయిలో నీరు లేకపోవడం అలాగే కరోనా మహమ్మారి   వల్ల చాలామందికి బయట ఎంట్రెన్స్ లేకపోవడంతో ఇలా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కృష్ణా నదిలో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వరకు ఎక్కువ మోతాదులో నీరు అనేది ఉండడంతో బోటు ప్రయాణాన్ని అయితే ప్రారంభించారు. 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

08 -21

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

 దాదాపుగా 120 కిలోమీటర్ల పాటు దూరం ఉండే ఈ ప్రయాణానికి మొదటి రోజు రాష్ట్రం తో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. అంతేకాక నాగార్జునసాగర్ నుంచి నందికొండ మీదగా ఏలేశ్వరం మరియు సలేశ్వరం, తూర్పు కనుమలు మరియు నల్లమల అడవి ప్రాంతం అందాలను వీక్షించేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టడంతో  పెద్ద ఎత్తున  పర్యాటకులు  వస్తున్నారు. కాబట్టి ఈ శీతాకాలంలో ఎవరైతే మంచి పర్యాటక ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నారు కచ్చితంగా ఈ శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ వరకు వెళ్లేటువంటి బోటు ప్రయాణం చేయడం వల్ల మంచి సంతృప్తి కలుగుతుందని  పర్యాటకశాఖ అధికారులు చెప్తున్నారు. 

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

 

 పర్యాటకానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరమైతే లేదని   నా దగ్గరలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతంగా భావిస్తారు. కాబట్టి కొత్తగా 120 మంది ప్రయాణించేలా ఏసి లాంచ్ ని కూడా అధికారులు శనివారం ప్రారంభించారు. ఇక ఇక్కడి నుండి శ్రీశైలం వరకు 120 కి.మీరా ఏడు గంటల పాటు ఈ ప్రయాణం అనేది ఉంటుంది. లంచ్ ప్రయాణానికి పెద్దలకు 2000 పిల్లలకు 1600 రూపాయలుగా టికెట్లు నిర్ణయించారు. ఇక నాగార్జునసాగర్ డ్యాంలో నీటిమట్టం 575 అడుగులు ఉన్నంతవరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ తెలిపింది. కాబట్టి ఎవరైతే టూర్లకు అలాగే పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఇదొక  మంచి పర్యాటక ప్రాంతంగా ఎంచుకొని ఇక్కడికి వచ్చి మరీ బోటు ప్రయాణాన్ని ఆస్వాదించాలని  తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?