Karthika Masam: రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం సందర్భంగా అన్ని దేవాలయాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పూజలు మరియు పుణ్య స్నానాలనేవి ఎక్కువ అయిపోయాయి. అయితే తాజాగా తెలంగాణలోని కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ కార్తీక పూజలు అనేవి ఘనంగా నిర్వహిస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా చాలా మంది భక్తులు కార్తిక స్నానాలు ఆదరించడంతోపాటు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే ఇది కేవలం ఒక కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే కాకుండా కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతి సోమవారము కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పుణ్యా స్నానాలను ఆచరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ దేవాలయం చూసినా కూడా నిశ్శబ్దంగా అయితే అసలు లేదు. ఈ కార్తిక మాసంలో హిందువులు చాలామంది కూడా ఉపవాస దీక్షలు అనేది చేస్తూ ఉంటారు. ఈ కార్తిక మాసంలో మరీ స్పెషల్ గా మిగతా రోజులు వేరు సోమవారం రోజు వేరు. ఎందుకంటే సోమవారాలు రెండు ఏకాదశులు మాత్రం చాలా నిష్టంగా ఉండి చాలా మంది కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇక ఉపవాస దీక్ష అనేది పాటిస్తే అత్యంత బలవంతమైనదని పురాణాలు చెబుతుండడంతో ప్రతి ఒక్కరు కూడా వారి కోరికలు తీరాలనే ఆలోచనలలో భాగంగా ఉపవాసం చేస్తున్నారు.
ఈ కార్తీకమాసంలో నెలరోజుల పాటు చాలామంది ఒంటిపోట భోజనం చేసి మరో పూట ఉపవాసం ఉంటారు. అంతేకాకుండా చాలామంది ఎవరికి ఇష్టమైన వాళ్ళ దేవుడి యొక్క మాల దీక్షలను ధరిస్తారు. కాబట్టి వారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీకమాసంలో తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు అనేవి తీర్చుకొని తర్వాత చన్నీటితో స్నానం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ధ్యానంలో మునిగితేలాలి. అనంతరం ఎక్కడ దేవాలయాలు ఉన్నా సరే అక్కడికి వెళ్లి భజనలు చేస్తూ పురాణ కాలక్షేమనేది చేస్తూ ఉంటారు.

కాబట్టి ఈ కార్తీకమాసం ఎంతో పవిత్రమైనది అందులోనూ నిత్యం దేవుళ్ళనుస్మరిస్తూ ఉండడంతో ప్రతి ఒక్క దేవాలయంలోనూ భక్తులతో కిటికీటలాడుతున్నాయి. ఇక ఈ దేవాలయాలను దర్శించుకోవడానికి విదేశాల నుండి కూడా మన భారతదేశంలోని మన రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ దేవుళ్లకు ఎంత ప్రాధాన్యత ఉంది అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది.