Mufasa Telugu Trailer: ది లయన్ కింగ్ ముఫాసాగా మహేష్ బాబు... అదిరిపోయిందిగా?
బుధవారం తెలుగు వర్షన్ ట్రైలర్ ను కూడా ముఫాసా మూవీ బృందం విడుదల చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైర ల్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇందులో మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడమే. అంతేకాకుండా ఇందులో మహేష్ బాబు సింహం పాత్రకు డబ్బింగ్ చెప్పడంతో అటు మహేష్ బాబు ఫ్యాన్స్ అలాగే ఈ చిత్రం కు సంబంధించినటువంటి మూవీ యూనిట్ అలాగే టాలీవుడ్ శని ప్రియులందరూ కూడా తెగ సంతోషపడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ అలాగే సినిమా ప్రియులందరూ కూడా ఈ ట్రైలర్ ను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలలో షేర్ చేస్తూ పెద్ద సపోర్ట్ గా నిలుస్తున్నారు.
కాబట్టి ప్రతి ఒక్క పాత్ర కూడా అలాగే ఆ వాయిస్ కూడా ప్రతి ఒక్కరును ఆకట్టుకోవడం విశేషం. ఇక ఈ చిత్రం అనేది డిసెంబర్ 20 న ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కాబోతుంది. కాబట్టి ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా చాలామంది కూడా మహేష్ బాబు వాయిస్ వినడానికి వెళ్తారు.