Pushpa 2: ఇవేం ప్రమోషన్లు బాబోయ్.... ఆల్ ఇండియా కుర్ కురే మరియు బిస్కెట్ల ప్యాకెట్లపై పుష్ప 2.. !
ఎందుకంటే పుష్ప సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న సందర్భంగా మూవీ యూనిట్ కొత్తగా ఆలోచించి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. చిన్నపిల్లలు తినే బిస్కెట్లు మరియు కురుకురేలపై అలాగే అగరబత్తులపై పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ పోస్టర్లు ముద్రించడంతో అవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. దీంతో కేవలం పెద్ద వారికి మాత్రమే కాకుండా ఈ సినిమా చిన్నపిల్లలకి కూడా తెలిసేలా బాగానే ప్రమోషన్స్ చేస్తున్నారు మూవీ యూనిట్.
ఇప్పటికే ఈ సినిమాలో చాలామంది పెద్ద నటీనటులు పాత్రలు చేయడంతో సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. కాబట్టి ఈ సినిమా డిసెంబర్ 5వ తారీఖున దేశవ్యాప్తంగా విడుదలవుతుండడంతో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అని చాలామంది సినీ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ప్రమోషన్ లో వినూతనంగా ఆలోచించి కొన్ని వస్తువులపై పుష్ప టు పోస్టర్ను ముద్రించడం అనేది మంచి విషయమనే చెప్పాలి. ఇది ప్రమోషన్ లో ఒక కొత్త టెక్నాలజీ ఆలోచనల భావిస్తున్నారు అందరూ. మరి ఎన్నో అంచనాల మీద త్వరలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంటుందో లేదో మీరే కామెంట్ చేయండి.