Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Red Sandalwood: పుష్ప సినిమాలో చూపించినట్టుగా ఎర్రచందనం కు ప్రస్తుతం చాలానే డిమాండ్ ఉంది. అందుకే చాలా మంది ఎర్రచందనము చెట్లను తెలియకుండా అందరికీ  వాటిని ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఎర్రచందనం చెట్టు గురించి తెలియని వారే ఉండరు. ఎందుకంటే ఆ ఎర్రచందనం ఒక చెట్టు దొరికినా సరే కొన్ని కోట్లలో డబ్బును సంపాదించుకోవచ్చు. పుష్ప సినిమాలో కూడా అచ్చం ఇలానే  ఎర్రచందనం అమ్మి  అల్లు అర్జున్ ఏ స్థాయికి ఎదుగుతాడో మనందరం చూసాం. 

 ఇక ఎర్రచందనం అనేది భారతదేశానికి చెందిన చాలా ఖరీదైన మరియు అరుదైన చెట్టు కాబట్టి వీటికి విపరీతమైన డిమాండ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎర్రచందనం చెట్టు అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు అలాగే కర్ణాటక రాష్ట్రాల్లోనే దొరుకుతుంది. ఇక ఈ చెట్లు అనేవి ఎక్కువగా సతత హరిత అడవులలో కనిపిస్తాయి. ఇక బాగా ఎరుపు రంగులో ఉండే ఈ చెట్లు చూడడానికి చాలా అందంగా అలాగే బలంగా కూడా ఉంటాయి. గట్టమైన అడవుల్లో మాత్రమే ఈ చెట్లు ఉండగా  వాటిని కొంతమంది అక్రమంగా నరికేసి వేరేచోట అమ్ముకుంటున్నారు.  ఈ అమ్మే సమయంలో ఎవరైనా పోలీసులకు దొరికితే వాళ్ల గతి అంతే ఇక. ఈ ఎర్రచందనం చెట్లు అనేవి నరకడం చట్టపరంగా విరుద్ధం. 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

 ఇక ఈ ఎర్రచందనం  ను ఎక్కువగా ఫర్నిచర్, విగ్రహాలు తయారీ, అలంకరణ వస్తువులు, ఫర్ఫ్యూమ్స్ ఆంటీ అనేక వస్తువులలో ఉపయోగిస్తారు. కాబట్టి ఈ ఎర్రచందనం చెక్కతో తయారు చేయబడిన ప్రతి వస్తువు కూడా చాలా విలువైనదిగా భావిస్తారు. ఎందుకంటే అవి చాలా సంవత్సరాలు పాటు రావడంతో పాటు చెట్టుకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఎర్రచందనం సగటు ధర కేజీ 50,000 నుండి లక్ష వరకు ఉంటుందట.  

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

1004

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

ఇక మంచి నాణ్యమైన ఎర్రచందనం ద్వారా కిలో ఏకంగా రెండు లక్షలు వరకు ఉంటుందట. కాబట్టి దీనికి దేశవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. ఇక భారత దేశం 1960 వరకు ప్రపంచంలోనే అత్యధికంగా ఎర్రచందనం మరియు చందనం ఉత్పత్తి చేసే దేశంగా పేరుపొందింది. ఇక తర్వాత ప్రభుత్వ చర్యల కారణంగా భారతదేశంలో గంధపు చెక్క ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యధిక చందనం ను ఉత్పత్తి చేస్తుంది.

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?