Akkineni Awards : అక్కినేని అవార్డు చిరంజీవికి దక్కాలా?.. లేదా మోహన్ బాబుకు దక్కాలా?
ఇక సినీ వజ్రోత్సవాల సమయంలో చిరంజీవికి లెజెండ్ అవార్డు ప్రకటించడం పట్ల మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలతో అప్పట్లో చిరంజీవి చాలా బాధపడ్డారు. అందుకే తన అవార్డును కాలమానికలో వేశారు అన్నది కూడా మనకు తెలిసింది. మోహన్ బాబుది అప్పటికి కోపమే. ఆయనే తనకు ఇవ్వాలని అడగలేదు... చాలామంది పేర్లు చెప్పారు. కానీ ప్రస్తుతం చిరంజీవి ఎంతో ఎత్తుకి ఎదిగారు. కానీ మోహన్ బాబు మాత్రం అంతే కిందకు పాతాళంలోకి పడిపోయారు.
ఇక ప్రస్తుతం చిరంజీవి గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన లెజెండ్ యాక్టర్ అనే విషయంలో ఎవరికీ కూడా అభ్యంతరాలు ఉండవు. మోహన్ బాబు లాంటి వ్యక్తులు చేసే అభ్యంతరాలకు అసలు విలువే ఉండదు. అలాంటి వారి గురించి పట్టించుకోవడం కూడా అనవసరమనే చెప్పాలి. ఎందుకంటే మోహన్ బాబు అనే వ్యక్తి ఏ విషయంలోనూ ప్రథముడు కాదు కాబట్టి. ప్రస్తుతం ఈయన సినిమాల్లో నటిస్తే చూసే వాళ్ళు కూడా లేరు. ఒక టికెట్ కూడా అమ్ముడుపోనీ అటువంటి నటుడు ఒక లెజెండ్తో సమానంగా పోల్చుకోవడం హాస్యాస్పదమే.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి కచ్చితంగా ఒక లెజెండ్రీ హీరో అనే చెప్పాలి. దీనికి ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక చిరంజీవితో మోహన్ బాబుని అసలు పోల్చకూడదు. ఆయన కొన్ని సినిమాల్లో మాత్రమే హీరో చేశారు. కానీ చిరంజీవి ఇప్పటికి 150 పైగా సినిమాలు చేశాడు . కాబట్టి లెజెండరీ హీరో ఎవరు అని మనం పేరు చెప్పగానే అది కచ్చితంగా చిరంజీవి మాత్రమే ఉంటారు.
ఇకనుంచి సినీ ఇండస్ట్రీ నుంచి అయినా మరోచోటైనా చిరంజీవి లెజెండ్ కాదన్న అంశంపై చర్చకు అనేది రాకూడదు. దురదృష్టవశాత్తు చిరంజీవితో పాటు ఆయనకు సంబంధించిన వారే ఈ వివాదాన్ని అనేది తెరపైకి చేస్తున్నారని కొందరు అంటున్నారు. లెజెండ్ అనేదానికి ఎవరు ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి అర్హత కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే ప్రజలే ఎప్పుడో లెజెండ్ హీరోగా చిరంజీవికి గుర్తింపు అనేది ఇచ్చారు. ఇలాంటి చర్చను రానివ్వకపోవడమే లిజెండ్ మెగాస్టార్కు మనం ఇచ్చేటువంటి గౌరవం.