Venu Swamy: మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం రాబోతున్న సందర్భంగా చాలా రాశుల వారు తమ జాతక ఫలాలు ఏ విధంగా ఉంటాయనే ఉత్కంఠ అయితే చాలామందిలోనూ ఉంది. ఎప్పుడెప్పుడు జాతక ఫలాలు విడుదల చేస్తారా, అందులో నా రాశి ఉందా లేదా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు అయినటువంటి వేణు స్వామి ద్వాదశరాశుల వారి రాశిఫలాలనూ తాజాగా వివరించారు. ప్రస్తుతం ఈ వేణు స్వామి జ్యోతిష్య అంచిన ప్రకారం కర్కాటక రాశి వారి జీవితమనేది 2025 వ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు.
2025 లో కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా సాగుతుందని అన్నారు. పునర్వసు నాలుగవ పాదం, పుష్యమి ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు వారు కర్కాటక రాశి వారికి చెందిన వారిని అన్నారు. ఇక ఈ సంవత్సరం గురువు కర్కాటక రాశిలో వ్యయస్థానంలోకి రాబోతున్నప్పటికీ భాగ్య స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని అన్నారు. వచ్చే సంవత్సరం కర్కాటక రాశి జాతకులు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 2025 సంవత్సరం కర్కాటక రాశి జాతకులకు చాలా విధాలుగా కలిసి వస్తుందని వేణు స్వామి తెలిపారు.
విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని , అలాగే వారి ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుందని, విదేశాలకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా సరైన మంచి సమయం వస్తుందని తెలిపారు. మరి ముఖ్యంగా 2025వ సంవత్సరంలో డాక్టర్లు మరియు యాక్టర్లు అలాగే లాయర్లు ఈ మూడు రంగాల వారికి కర్కాటక రాశిలో చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అలాగే మరోవైపు వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి కూడా మంచి లాభాలు అందుతాయి అని తెలిపారు.

2025 సంవత్సరంలో కర్కాట రాశి వారికి చిన్నచిన్న ఇబ్బందులు మినహా మిగతావన్నీ కూడా రాసిపరంగా విపరీతమైన రాజు యోగం కలుగుతుందని అన్నారు. ఏ పనిని ప్రారంభించిన లాభం పొందుతారని అన్నారు. ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే ప్రతి గురువారం రోజు పసుపు రంగు గల బట్టలను ధరించి శ్రీకాళహస్తిలో గురుదక్షిణమూర్తి వద్ద అచ్చం చేయించుకుంటే సరిపోతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి తెలియజేశారు.