World Meditation Day: యోగా దినోత్సవమే కాదు!.. త్వరలోనే ధ్యాన దినోత్సవం జ‌రుపుకోబోతున్నాం.. అది ఎప్పుడంటే?

World Meditation Day: యోగా దినోత్సవమే కాదు!.. త్వరలోనే ధ్యాన దినోత్సవం జ‌రుపుకోబోతున్నాం.. అది ఎప్పుడంటే?

World Meditation Day: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మనం యోగా దినోత్సవం మాత్రమే జరుపుకుంటూ ఉన్నాము. కానీ నిత్యం కూడా మనం ఏదో ఒక పని ఒత్తిడితో సతమతమవుతున్న రోజులు ఇవి. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం యోగా మరియు ధ్యానం వంటివి అవసరమని చాలా మంది కూడా నిపుణులు చెబుతున్న మాటలే. అయితే ఇక ఈ క్రమంలోనే యోగా  దినోత్సవం లాగా ధ్యాన దినోత్సవం కూడా  నిర్ణయించింది. 

 ఇక అసలు విషయానికి వస్తే యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు పదివేల కిందట భారత్ చేసిన ప్రతిపాదనను ఐరాస ఆమోదించి ఏటా యోగ దినోత్సవం నిర్వహిస్తుంది. అయితే ఇక తాజాగా ధ్యాన దినోత్సవం కూడా నిర్వహించేందుకు భారతదేశంలో పాటు వివిధ దేశాలు కూడా   తీర్మానాలు ముందుకు తీసుకువచ్చాయి. ఇక దీనికి ఐక్యరాజ్యసమితి కూడా జనరల్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం అనేది తెలిపింది . ఇక దీంతో డిసెంబర్ 21వ తేదీన  " ప్రపంచ ధ్యాన దినోత్సవం " గా నిర్ణయించారు. 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

 ఇక ఈ విషయం అనేది ఐరాసాలోని భారత శాశ్వత ప్రతినిధి అయినటువంటి పర్వత నేని  హరీష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇక ప్రతి ఏటా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించేందుకు భారత్ తో సహా ఇతర దేశాలన్నీ కూడా  జరుపుకోనున్నాయి . అయితే ఈ డిసెంబర్ 21వ తారీకు మాత్రమే ఒక ప్రత్యేకత ఉండడంతో ఈ తేదీని నిర్ణయించారు. భారత సాంప్రదాయ ప్రకారం శీతకాల  అనంతరం అంటే ఉత్తరాయణంలో అడుగుపెట్టి రోజు కావడంతో చాలా పవిత్రమైనదిగా భారతీయులు చూడడంతో ఈ తేదీని పెట్టారు. 

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

0802

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

ఇక 193 మంది సభ్యులు ఉన్న ఐరాస జనరల్  అసెంబ్లీ శుక్రవారం నాడు సమావేశమై దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, మెక్సికో, బంగ్లాదేశ్, పోర్చుగల్, బల్గేరియా వంటి దేశాలు కోస్పాన్సర్ గా నిలిచాయి.  ప్రపంచ ధ్యాన దినోత్సవం ఆమోదపడడానికి ఇవన్నీ కూడా బాగానే సపోర్ట్ చేశాయి.

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?