Banana Leaf Halwa : అరటి ఆకులతో హల్వా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. నెటిజన్లు ఏమన్నారో తెలుసా?
అది అందరికీ తెలిసిన విషయమే కానీ.. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఓ యువకుడు అరటి ఆకులతో ఏకంగా హల్వానే తయారు చేశాడు. మీరు షాక్ అయ్యారు కదా. మీరు షాక్ అయినా.. కాకపోయినా అదే నిజం. అరటి ఆకులతో ఆ వ్యక్తి హల్వా తయారు చేశాడు. అతగాడు చేసిన ఆ హల్వా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అసలు ముందు ఆ వ్యక్తి ఎలా అరటి ఆకుల హల్వా చేశాడు? ఎందుకు చేశాడు? అనేది తెలుసుకుందాం. అతడు ఒక వ్లాగర్. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఒకరోజు ఎందుకో మనోడికి అరటి ఆకుల హల్వాను తయారు చేయాలని అనిపించింది. అంతే.. ఇక వెంటనే అరటి ఆకులను తీసుకొచ్చి వెంటనే హల్వా చేయడం స్టార్ట్ చేశాడు.
అరటి ఆకులను ముక్కలు ముక్కలుగా కోసి.. వాటిని గ్రైండ్ చేసి వాటిని వడబోసి ఒక పాన్ లో నెయ్యి వేసి దానికి ఈ రసాన్ని యాడ్ చేశాడు. అందులో చెక్కర, డ్రై ఫ్రూట్స్, ఇతర కొన్ని పదార్థాలు యాడ్ చేసి దాన్ని కాసేపు కలిపి హల్వాలా చిక్కబడేదాకా కలిపాడు. ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని టేస్ట్ చేశాడు. అసలు ఆ హల్వా అతడికి నచ్చిందో లేదో తెలియదు
కానీ.. నెటిజన్లు అయితే ఆ హల్వాను చూసి మాత్రం తట్టుకోలేకపోయారు. ఆ వీడియోకు ఇప్పటి వరకు 49 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతకంటే ఫన్నీగా కామెంట్లు కూడా వచ్చాయి. నీ ఒరిజినల్ రియాక్షన్ కు హేట్సాఫ్ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. అతడి ఎక్స్‌ప్రెషనే చెబుతోంది దాని టేస్ట్ ఎలా ఉందో? క్లోరోఫైల్ హల్వా, హల్క్ హల్వా, ఏలియన్ ఫుడ్ ను తయారు చేసిన బ్రో, నీ సర్వీస్ కు ధన్యవాదాలు, మాకు తెలుసు..
మేము ఏం చేయకూడదో.. అంటూ ఇలా రకరకాలుగా ఆ వీడియోకు సోషల్ మీడియాలో తమకు నచ్చినట్టుగా నెటిజన్లు కామెంట్లు చేస్తూ వెళ్లిపోయారు. దీంతో సోషల్ మీడియాలో ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది. నిజానికి ఇలాంటి వింత రెసిపీలు చేయడం ఇదే కొత్తేమీ కాదు. ఇదివరకు చాలామంది సోషల్ మీడియా వేదికగా కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త వంటకాలను కనిపెట్టారు.
ఐస్ క్రీమ్ పలావ్, ఓరియో పకోడి, యాపిల్ పకోడి, కూల్ డ్రింక్ నూడుల్స్.. ఇలా రకరకాల వింత వంటకాలను కనిపెట్టి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా అరటి ఆకులతో హల్వా అనే రెసిపీని చేసి నెటిజన్లకు టేస్ట్ చూపించబోయాడు కానీ.. నెటిజన్లు మాత్రం జస్ట్ లో తప్పించేసుకున్నారు. అది స్టోరీ.