Ayurvedic liquor benefits : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి కొత్త విస్కీ... తాగితే కిక్కుతోపాటు ఎన్నో లాభాలు
మద్యం తాగటం వల్ల ఎంత నష్టం కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మద్యానికి బానిసైన వాళ్ళు చిన్నవయసులోనే కన్ను మూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ సమాజంలో జరిగే నేరాలకు కారణం కూడా ఈ మధ్య పానమే.తాగిన మత్తులో డ్రైవింగ్ చేస్తూ తన ప్రాణాలను తీసుకోవటమే కాకుండా అమాయకుల ప్రాణాలను కూడా తీసుకుంటున్నారు.మరి మద్యం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి కదా.మరి ప్రభుత్వాలు ఎందుకు నిషేధించడం లేదు..

ప్రభుత్వాలు ఇలాంటి పనులు అసలు చేయవు.ఎందుకు అనగా మద్యం మీద వచ్చే ఆదాయమే ప్రభుత్వానికి ప్రధాన ఆధారం.అందువల్ల వాటి జోలికి ఈ ప్రభుత్వాలు పోవు.అయితే ఇప్పటివరకు మద్యం తాగటం వల్ల ఆరోగ్యం పాడవుతుంది అన్నమాటలే విన్నం.అంతేకాక మందు తాగిన వారి దగ్గర నుండి ఎంతో దుర్వాసన కూడా వస్తుంది.ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టడానికి మార్కెట్లోకి ఒక కొత్త మద్యాన్ని తీసుకు వచ్చారు.
దీనిని తాగటం వలన కిక్ ఎక్కుతుంది కానీ ఆరోగ్యం పాడవ్వదు. దుర్వాసన కూడా రాదు. అంతేకాక ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అన్నారు. ఇంతకు ఆ మందు ఏమిటి అంటే కొత్తగా హైదరాబాద్ కు చెందిన ఓ లిక్కర్ కంపెనీ ఒక ప్రకటన చేసింది. వాళ్లు తయారు చేసిన మద్యం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. సాధారణ మద్యం లాగే కిక్ ఎక్కుతుంది అని ప్రకటన చేసింది. ఇంతకు ఆ కంపెనీ ఏది అంటే..
ఈ మధ్యలో ఎటువంటి సింథటిక్ రంగులు,రుచులు వాడకుండా ఆయుర్వేద పద్ధతిలో దీనిని తయారు చేసినట్లు తెలిపారు. అంతేకాక ఈ లిక్కర్ లో బయో ప్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, బయో ఆల్కలాయిడ్స్, ఫైటో కెమికల్స్ ఇతర మూలికలు ఉన్నాయి అని తెలిపారు.
ఈమధ్య తయారీలోకి పసుపు,కలబంద, అకాసియా, అల్లం, తులసి, దాల్చిన చెక్క,కోతిమీర, నల్లమిరియాలు, చిరాటా, దుంప,మెంతులు, బ్లాక్ బెర్రీస్, గ్వారానా, రైజోమ్, జెనిటన్, ఎలికంపేన్, రటానీ రూట్, లాంటి సహజ సిద్ధమైన వలేరియన్, వెనీల్ల,వైరోనికా, వైల్డ్ చెర్రీ,తేనె, బే ఆకులు, బ్రమోనియా రూట్ ఇతర పదార్థాలు ఉపయోగించినట్లు తెలియజేశారు. అందుకే ఈ మద్యం తాగినప్పుడు కిక్ తో పాటు ఆరోగ్యం అని అంటున్నారు..