8 cockroaches in 1 dosa : ఒక్క దోశలో 8 బొద్దింకలు.. వాటిని చూసి అక్కడే వాంతి చేసుకున్న మహిళ.. ఎక్కడో తెలుసా?
అక్కడ ఫుడ్ ఎలా ఉన్నా కూడా రెస్టారెంట్ కు పేరు ఉంటే చాలు. ఖచ్చితంగా ఆ రెస్టారెంట్ కే వెళ్తారు. హైజీన్ అనే దాని గురించే అస్సలు పట్టించుకోరు. అసలు బయట ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా సరే, ఏదో ఒక సమయంలో బొద్దింకలు, పురుగులు రావడం చూసే ఉంటాం. వాటిని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా చూశాం.
ఈ ఘటన మద్రాస్ కాఫీ హౌస్ లో జరిగింది. మద్రాస్ కాఫీ హౌస్ అంటే అదేదో చెన్నైలో ఉందని అనుకునేరు. కానే కాదు.. న్యూఢిల్లీలో ఉంది ఈ కాఫీ హౌస్. కన్నౌట్ ప్లేస్ లో ఉంది ఈ రెస్టారెంట్. నిజానికి ఇది చాలా ఫేమస్ రెస్టారెంట్ అనుకోండి. అందుకే అక్కడికి కస్టమర్లు క్యూ కడతారు. అలాగే.. ఓ మహిళ అక్కడ ప్లేన్ దోశను ఆర్డర్ చేసింది. దోశ రాగానే ఏం చక్కా తిందామని రెడీ అయింది. రెండు మూడు బైట్స్ కూడా తిన్నది.

ఆ తర్వాతే తనకు తెలిసింది. ఆ దోశలో బొద్దింకలు ఉన్నాయని. ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ చివరకు 8 బొద్దింకలను బయటికి తీసింది ఆ మహిళ. ఈ ఘటన 7 మార్చి, 2024 న జరిగింది. వెంటనే ఆ మహిళ తన బాధనంతా ఇన్‌స్టాలో వెళ్లగక్కుకుంది. కానీ.. ఏంటి లాభం. అప్పటికే తను కొంచెం దోశను తినడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఆ బొద్దింకలను చూసి అక్కడే వాంతి చేసుకునే పరిస్థితి కూడా జరిగింది.
8 cockroaches in 1 dosa : బెడిసి కొట్టిన సౌత్ ఇండియన్ మీల్
నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా వంటకాలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందులోనూ ఇడ్లీ, వడ, దోశ.. వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే.. ఢిల్లీకి చెందిన ఇషానీ అనే యువతి తన ఫ్రెండ్ తో కలిసి ఢిల్లీలో ఫేమస్ అయిన మద్రాస్ కాఫీ హౌస్ కు వెళ్లి దోశ ఆర్డర్ చేశారు.
కానీ.. తీరా దోశ వచ్చాక కానీ.. రెండు మూడు బైట్స్ తిన్నాక కానీ.. అందులో బొద్దింకలు ఉన్న విషయాన్ని గుర్తించలేదు. వెంటనే ఆ దోశను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లోనూ ఇషానీ ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసి రెస్టారెంట్ వాళ్లు ఇషానీతో బేరానికి కూడా వచ్చారు. తనకు జరిగిన దానికి క్షమాపణ చెబుతూ నష్టపరిహారం ఇస్తామని తెలిపారు.
సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయొద్దని బతిమిలాడారు. కానీ.. తను మాత్రం ఇలాంటి ఘటన మరోసారి జరగకూడదని ఈ విషయం పది మందికి తెలియాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో తన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఇషానీకి మద్దతు తెలుపుతున్నారు.